Sat Dec 21 2024 06:33:22 GMT+0000 (Coordinated Universal Time)
కల్కి 2898 AD నుంచి ప్రభాస్ న్యూ లుక్ ఫోటో లీక్..
ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD మూవీ నుంచి కొత్త ఫోటో లీక్ అయ్యింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన తరువాత సినిమా పై గ్లోబల్ వైడ్ ఆసక్తిని సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్ టు హాలీవుడ్ ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీ నుంచి ప్రభాస్ న్యూ లుక్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది.
ఈ మూవీ సంబంధించిన VFX వర్క్స్ పలు దేశాల్లోని టాప్ గ్రాఫిక్ కంపెనీల్లో జరుగుతున్నాయి. తాజాగా ఒక కంపెనీ నుంచి ప్రభాస్ లుక్ ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ విషయం పై కల్కి మేకర్స్ సీరియస్ అయ్యారు. సంబంధిత VFX కంపెనీ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అనధికారికంగా ఫోటోని లీక్ చేసినందుకు ఆ కంపెనీ పై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేసినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ లీక్ అయిన ఫోటోని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ నుంచి తొలిగించేలా చర్యలు చేపట్టారు.
అలాగే అభిమానులను కూడా ఆ ఫోటోని షేర్ చేయొద్దు అంటూ కోరుతున్నారు. కాగా ఈ సినిమాని సి అశ్వినీ దత్.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ పాత్రని పోషిస్తున్నాడు. అక్టోబర్ నుంచి కమల్ ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడని సమాచారం. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించినప్పటికీ.. అప్పుడు రిలీజ్ కావడం కష్టమని తెలుస్తుంది.
Next Story