Mon Dec 30 2024 20:27:45 GMT+0000 (Coordinated Universal Time)
రాధే శ్యామ్ సినిమా ఫెయిల్యూర్ పై ప్రభాస్ రిప్లై ఇదే
హిందుస్థాన్ టైమ్స్‌తో ప్రభాస్ మాట్లాడుతూ “బహుశా కోవిడ్ లేదా మేము స్క్రిప్ట్‌లో ఏదైనా మిస్ అయ్యి ఉండవచ్చు. ఆ విషయాలు..
రాధే శ్యామ్ సినిమా ఫెయిల్యూర్ గురించి ప్రభాస్ మాట్లాడాడు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా గత నెలలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ చిత్రం వైఫల్యంపై కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం, లేదా స్క్రిప్ట్ లో చోటు చేసుకున్న చిన్న చిన్న తప్పులే కారణం అయి ఉండవచ్చు అని ప్రభాస్ చెప్పాడు.
హిందుస్థాన్ టైమ్స్‌తో ప్రభాస్ మాట్లాడుతూ "బహుశా కోవిడ్ లేదా మేము స్క్రిప్ట్‌లో ఏదైనా మిస్ అయ్యి ఉండవచ్చు. ఆ విషయాలు మీకు బాగా తెలుసు. ఆ జోన్లో ప్రజలు నన్ను చూడటానికి ఇష్టపడకపోవచ్చు" అని అన్నాడు. బాహుబలి 2 విడుదలైనప్పటి నుండి, ప్రభాస్ రెండు సినిమాలు చేసాడు. అవి సాహో, రాధే శ్యామ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కవుట్ కాలేదు. బాహుబలి, బాహుబలి 2 యొక్క భారీ విజయం కొత్త ప్రాజెక్ట్‌లను ప్రభావితం చేస్తుందా అని అడిగినప్పుడు, ప్రభాస్ ఇలా అన్నాడు, "అవును, బాహుబలిలా మంచి స్పందన రావాలని నా దర్శకులు, నిర్మాతలపై ఒత్తిడి ఉంది.
బాహుబలిని క్రాస్ చేయాలనీ, అతి పెద్ద సినిమా చేయాలనీ నాకు అంత ఒత్తిడి లేదు. బాహుబలి సినిమా రావడం నా అదృష్టం కానీ దేశంలో వీలైనన్ని ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించేలా ఉండాలని అనుకుంటూ ఉన్నాను" అని తెలిపాడు ప్రభాస్. ప్రభాస్ ఆదిపురుష్‌లో రాముడి లా కనిపిస్తాడు. ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ కనిపించనున్నాడు. ఇక కేజీఎఫ్ దర్శకుడితో సాలార్ కూడా ఉంది. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్‌లతో ప్రాజెక్ట్ K కూడా ప్రభాస్ చేస్తూఉన్నాడు.
Next Story