Mon Dec 23 2024 10:42:39 GMT+0000 (Coordinated Universal Time)
Salaar Trailer : మోస్ట్ వైలెంట్ మ్యాన్ 'సలార్' ట్రైలర్ వచ్చేసింది..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ 'సలార్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
Salaar Trailer : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ 'సలార్'. రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్గా నటిస్తున్నారు. కాగా ఫస్ట్ పార్ట్ ని ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని నేటి నుంచి మొదలు పెట్టబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మోస్ట్ వైలెంట్ మ్యాన్ సలార్ కి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు. 3 నిమిషాల 47 సెకండ్స్ తో ఉన్న ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేసేలా ఉంది. ఇక థియేటర్స్ లో చాలా కాలం నుంచి మిస్ అవుతున్న రెబల్ స్టార్ మాస్ని.. ఈ సినిమాతో చూడబోతున్నారు ఫ్యాన్స్. రిలీజ్ ఆ ట్రైలర్ వైపు మీరు ఒక లుక్ వేసేయండి.
కాగా ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లే.. ట్రైలర్ ని కూడా రెండు భాగాలుగా కట్ చేశారట. మరో ఆరు రోజుల్లో ఇంకో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఆ ట్రైలర్ తో ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఇద్దరు ప్రాణ మిత్రులు, భద్ర శత్రువులుగా ఎలా మారారు అనేది సలార్ కథ అండ్ అలాగే ఈ సినిమాకి కేజీఎఫ్ కి ఎలాంటి కనెక్షన్ లేదని దర్శకుడు రీసెంట్ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశారు.
Next Story