Mon Dec 23 2024 07:04:53 GMT+0000 (Coordinated Universal Time)
సలార్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ గురించి ఎగ్జిబిటర్లకు మెయిల్..
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ డైనోసార్ వచ్చేస్తుంది. సలార్ రిలీజ్ డేట్ గురించి ఎగ్జిబిటర్లకు ఓ మెయిల్ వచ్చిందట.
ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ కంబినేషనల్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. ఈ మూవీ కోసం రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యి అభిమానులకు షాక్ ఇచ్చింది. వాయిదా వేస్తున్న సంగతి చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం తెలియజేయలేదు. ఇక ఈ విడుదల తేదీ గురించి నెట్టింట అనేక వార్తలు వినిపిస్తుండడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ఈ సినిమా అసలు ఈ ఇయర్ లో రావడం లేదని, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ వార్తలు వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా అభిమానులను ఖుషి చేసే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎగ్జిబిటర్లకు ఓ మెయిల్ వచ్చిందట. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నామంటూ నిర్మాతలు ఆ మెయిల్ లో తెలియజేస్తున్నట్లు సమాచారం.
ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇది పక్కా ఇన్ఫార్మేషన్ అని ఆయన తెలియజేశాడు. డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ తో ప్రభాస్ అభిమునులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా అదే టైములో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ మూవీ రిలీజ్ కూడా ఉంది. దీంతో ఈసారి పాన్ ఇండియా వైడ్ గట్టి పోటీ కనిపించనుంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.
కాగా సలార్ నిర్మాతులు గతంలో తెరకెక్కించిన కేజీఎఫ్-1.. షారుఖ్ 'జీరో' మూవీతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అప్పుడు షారుఖ్ పై కేజీఎఫ్ తో విజయం అందుకున్న నిర్మాతలు.. ఈసారి కూడా అది రిపీట్ చేయాలని చూస్తున్నారు. మరి వరుస హిట్స్ తో ఫుల్ స్పీడ్ లో ఉన్న షారుఖ్.. సలార్ బ్రేక్ లు వేస్తుందా లేదా చూడాలి.
Next Story