Sat Dec 21 2024 17:56:58 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పండగే
అమితాబ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేందుకు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న.. ప్రాజెక్ట్ K నుండి అప్డేట్ వచ్చింది. తాజాగా సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ మహాశివరాత్రి సందర్భంగా.. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ..కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాగా.. తాజాగా విడుదల చేసిన పోస్టర్.. ప్రాజెక్ట్ K పై మరింత అంచనాలను పెంచేసింది. ఎడారిలో ఓ భారీ చేతిని స్నీపర్స్ జాగ్రత్తగా చూస్తున్నట్లు పోస్టర్ లో కనిపిస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొణెతో పాటు అమితాబ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి.. దీపికా పదుకొణె పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అస్తమిస్తున్న సూర్యుడికి ఎదురుగా దీపికా ఓ రాక్ పై నిలబడి ఉంటుంది. కాగా.. సినిమా షూటింగ్ మొదలై ఏడాది పైనే అయినా.. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంపై డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.
Next Story