Fri Dec 20 2024 22:19:34 GMT+0000 (Coordinated Universal Time)
నిరాశలో ప్రభాస్, రామ్ చరణ్ అభిమానులు..
ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. డార్లింగ్ అభిమానుల పరిస్థితి ఒకలా ఉంటే, చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి మరోలా ఉంది.
ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక పక్క అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ తమ కొత్త సినిమా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంటే.. ప్రభాస్, చరణ్ మాత్రం తమ సినిమాల గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా ఈ నెల 28న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ మూవీ పోస్ట్‌పోన్ అయ్యిందని అంటున్నారు. దీంతో ఆ తేదిలోకి ఇతర సినిమాలు ఆల్రెడీ వచ్చి చేరాయి.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఈ పోస్ట్‌పోన్ చేస్తున్న విషయాన్ని కూడా మూవీ టీం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దీని గురించి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ని ఎన్ని ప్రశ్నలు వేసినా.. అటు నుంచి ఏ రెస్పాన్స్ రావడం లేదు. బాహుబలి నుంచి ప్రభాస్ ప్రతి సినిమాకి ఇలానే జరుగుతూ వస్తుంది. 2024 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన 'కల్కి 2898AD' కూడా వాయిదా పడబోతున్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ప్రభాస్ అభిమానుల పరిస్థితి ఇలా ఉంటే, రామ్ చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి మరోలా ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ చెంజర్' చిత్రాన్ని గత రెండేళ్లగా తెరకెక్కిస్తూనే ఉన్నారు. ఈ మూవీతో పాటు శంకర్ 'ఇండియన్ 2'ని కూడా తెరకెక్కిస్తుండడంతో.. ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇక ఎలాగోలా ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో గేమ్ చెంజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారు అనుకుంటే.. ఇప్పుడు ఆ స్కోప్ కనిపించడం లేదు.
ఇండియన్ 2 రిలీజ్ తరువాతే 'గేమ్ చెంజర్' చిత్రాన్ని శంకర్ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నాడు. ఇప్పుడు ఇండియన్ 2 ని ఆగష్టు 15న తీసుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజం అయితే.. గేమ్ చెంజర్ మూవీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానుంది. అంటే మరో ఏడాది పాటు చరణ్ నుంచి మరో సినిమా లేనట్లే. RRR నుంచి బయటకి వచ్చిన ఎన్టీఆర్ తన దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి తీసుకు వచేస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చరణ్ అభిమానులు మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story