సాహో లో సగం ప్రభాస్ కే పోతుందా?
యువీ క్రియేషన్స్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో భారీ తనం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తూనే ఉంది.. అందరిని షాక్ కి గురి చేస్తూనే [more]
యువీ క్రియేషన్స్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో భారీ తనం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తూనే ఉంది.. అందరిని షాక్ కి గురి చేస్తూనే [more]
యువీ క్రియేషన్స్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో భారీ తనం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తూనే ఉంది.. అందరిని షాక్ కి గురి చేస్తూనే ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఆగష్టు 30 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక సాహో ప్రమోషన్స్ కూడా భారీగా మొదలైపోయాయి. ఇప్పటికే యాక్షన్స్ సీన్స్ తో విపరీతంగా హైప్ తెచ్చుకున్న సాహో సినిమా.. ఇప్పుడు రొమాంటిక్ గా కూడా హైలెట్ అవుతుంది. ప్రభాస్ – శ్రద్ద కపూర్ లమధ్య రొమాంటిక్ ఫోజులో బయటికొస్తున్న పోస్టర్స్ మాత్రం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక సాహోలో యాక్షన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందొ .. లవ్ ట్రాక్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందనేలా ఉంది. ఇక సాహో యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో యువీ వారు సాహో ని నిర్మిస్తున్నారు.
యువీ నిర్మాతలు, హీరో ప్రభాస్ సన్నిహితులు కావడంతో సాహో కి ఎడా పెడా ఖర్చు పెడుతున్నారనే టాక్ ఉంది. ఎంతో హైప్ లేకపోతె ఫ్రెండ్ షిప్ కోసం అంత భారీగా ఎందుకు ఖర్చు పెడతారు. ఇక ఈ సినిమాకి ప్రభాస్ ఏ రేంజ్ పారితోషకం అందుకుంటున్నాడో అంటూ చాలానే ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజాగా బయటికొచ్చిన న్యూస్ ప్రకారం ప్రభాస్ సాహో సినిమాకి ఓ రేంజ్ లో పారితోషకం కింద అందుకోబోతున్నట్లుగా టాక్. అయితే ఇంత అని ప్రభాస్ రెమ్యునరేషన్ ఫిగర్ లేదుకానీ… సాహో కి జరగబోయే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్నిటితో కలిపి వచ్చే మొత్తంలో 50 శాతం ప్రభాస్ పారితోషకం కింద వస్తుందనేది న్యూస్. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం అంటే ప్రభాస్ అందుకోబోయే ఫిగర్ ని అంచనా వెయ్యడం కూడా కష్టమనేలా కనబడుతుంది. మరి సాహో కి పెట్టిన పెట్టుబడి, యాక్షన్స్ సీన్స్ అన్ని ఎంతగా హైలెట్ అనేలా ఉన్నాయో.. ప్రభాస్ పారితోషకం కూడా అంతే హైలెట్ అనేలా ఉంది వ్యవహారం.