Mon Dec 23 2024 11:11:20 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : డైనోసార్ ఆగయా.. ఇక 'సలార్' ప్రమోషన్స్ షురూ..
ప్రభాస్ ఇటీవల శాస్త్ర చికిత్స కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా తిరిగి వచ్చాడు.
Prabhas : గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధ పడుతున్న ప్రభాస్.. ఇటీవల చికిత్స కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలోనే అందుకు సంబంధించిన సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సి ఉండడంతో.. గత నెల రోజుల నుంచి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో.. ఇండియా తిరిగి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఇంతకీ అసలు ప్రభాస్ మోకాలికి గాయం ఎప్పుడు జరిగిందంటే.. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలలు తరబడి ఏకధాటిగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేయడంతో ప్రభాస్ ఈ మోకాలి సమస్యని ఎదుర్కొన్నాడు. ఆ మధ్య ఈ సమస్య కోసం తాత్కాలిక చికిత్స తీసుకున్నాడు. సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ ని ఆ మోకాలి నొప్పితోనే పూర్తి చేశాడు. ఆదిపురుష్ ప్రమోషన్స్ టైములో ప్రభాస్ సరిగ్గా నడవలేక ఇబ్బంది పడిన సందర్భాలు అందరూ చూసినవే.
ఆ నొప్పి మరింత తీవ్రతరం అవ్వడంతో ప్రభాస్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సలార్ రిలీజ్ కూడా వాయిదా పడడం, ప్రమోషన్స్ కి సమయం ఉండడంతో.. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న కల్కి, మారుతీ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం యూరప్ వెళ్లాడు. ఇప్పుడు ప్రభాస్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్ రాక కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
డిసెంబర్ నెలలో 'సలార్' రిలీజ్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మూవీ టీం సరైన ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్స్ని, గ్లింప్స్నే రీపోస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో రెబల్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఇండియా తిరిగి వచ్చేశాడు. ఇప్పటి నుంచి అయినా సలార్ ప్రమోషన్స్ మొదలవుతాయని అభిమానులు భావిస్తున్నారు. ఫిలిం వర్గాల్లో కూడా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Next Story