Sat Dec 21 2024 05:09:07 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : 'యానిమల్' ట్రైలర్ పై ప్రభాస్ రివ్యూ.. ఇన్స్టా పోస్ట్ వైరల్..
'యానిమల్' మూవీ ట్రైలర్ పై ప్రభాస్ ఇచ్చిన రివ్యూ చూశారా..?
'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం 'యానిమల్'. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అండర్ వరల్డ్ నేపథ్యంలో ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. డిసెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
సందీప్ వంగా తన గత ఇంటర్వ్యూల్లో.. అసలైన వైలెన్స్ అంటే ఏంటో యానిమల్ మూవీతో చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు సందీప్ చెప్పినదానికంటే ఈ మూవీలో ఎక్కువే ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. యాటిట్యూడ్కి, అండర్ వరల్డ్ డ్రామా సినిమాలకు ఈ చిత్రం మరో కొత్త డెఫినిషన్ కాబోతుందని అర్ధమవుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియాలో ట్రైలర్ పై తమ రివ్యూలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన రివ్యూని అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో యానిమల్ ట్రైలర్ ని షేర్ చేస్తూ.. "ట్రైలర్ అదిరిపోయింది. మెంటల్ మాస్ అంతే. ఈ మూవీ చూడడానికి నేనెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మూవీ టీంకి నా అభినందనలు" అంటూ రాసుకొచ్చారు.
ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు.. సందీప్ వంగతో ప్రభాస్ సినిమా గురించి ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి కలయికలో 'స్పిరిట్' అనే మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీని త్వరగా పట్టాలెక్కించండి అంటూ సోషల్ మీడియా ద్వారా రెబల్ అభిమానులు కోరుతున్నారు. కాగా ప్రభాస్ ప్రెజెంట్ సలార్, కల్కి, రాజా డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తి అయిన తరువాతే స్పిరిట్ పట్టాలు ఎక్కనుందని తెలుస్తుంది.
Next Story