ప్రభాస్ సాహోకి సాహో అంటున్నారు..!
ప్రభాస్ – సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న సాహో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ సాహో నేషనల్ వైడ్ [more]
ప్రభాస్ – సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న సాహో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ సాహో నేషనల్ వైడ్ [more]
ప్రభాస్ – సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న సాహో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ సాహో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన రెండు పోస్టర్స్ తో పాటు షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, 2 అంటూ ప్రభాస్ బర్త్ డేకి ఒకటి, హీరోయిన్ శ్రద్ద కపూర్ బర్త్ డేకి మరొకటి వదిలింది సాహో టీం. అసలు సాహో సినిమా కథ ఏమిటనేది రివీల్ కాకుండా చాఫ్టర్లు వదిలిన టీం సాహో సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తుంది. తాజాగా సాహో సినిమాపై ఒక భారీ న్యూస్ మీడియాలో హైలెట్ అయ్యింది.
భారీ ధర పలికిన ఓవర్సీస్ రైట్స్
అదేమిటంటే సాహో సినిమా ఆగష్టు 15న విడుదలంటూ మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదలకు రెడీ అవుతుండడంతో సాహో సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా సాహో సినిమా ఓవర్సీస్ హక్కులు ఎవ్వరి అంచనాలకు, ఊహలకు అందని విధంగా 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. యూ.వి క్రియేషన్స్ లో భారీగా తెరకెక్కుతున్న ఈ సాహో సినిమా ఓవర్సీస్ కి 42 కోట్లు వస్తే అన్ని భాషల శాటిలైట్స్ హక్కులకు, డిజిటల్ హక్కులకు కలిపి సాహో నిర్మాతలు 90 కోట్లపైనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని వినికిడి.
భారీ రేంజ్ లో బిజినెస్
ఇకపోతే ఓవర్సీస్ అంటే చైనాతో కలుపుని కాదు. చైనాని మినహాయించి ఓవర్సీస్ లో 42 కోట్లకు సాహో అమ్ముడుపోతే… చైనాకి మరో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు. మరి ఓవర్సీస్ కింద 42 కోట్లు కొల్లగొట్టిన సాహో… డిజిటల్ హక్కుల కింద 15 కోట్లుకి అమెజాన్ ప్రైమ్ వారు బేరసారాలు జరుపుతున్నారనే న్యూస్ వినబడుతుంది. కానీ సాహో నిర్మాతలు మాత్రం శాటిలైట్ మరియు డిజిటల్ కింద ఒకేసారి డీల్ క్లోజ్ చెయ్యాలని చూస్తున్నారట. మరి సాహోకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం మాత్రం కేవలం బాహుబలితో ప్రభాస్ కి పేరు రావడం వలనే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.