Fri Dec 20 2024 17:42:43 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : 'సలార్'లో ప్రభాస్ కేవలం ఇన్ని డైలాగ్సే చెప్పాడా..?
కేజీఎఫ్‌లో యశ్‌తో నీల్ చెప్పించిన డైలాగ్స్ చూసి.. సలార్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ 'సలార్'లో..
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా తెరకెక్కిన ‘సలార్’ మూవీ మొదటి భాగం డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా డైలాగ్స్ పై ఫ్యాన్స్ చాలా అసలు పెట్టుకున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ లో యశ్ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికి కూడా ఆ డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. మాస్ ఆడియన్స్ లో కేజీఎఫ్ డైలాగ్స్ ఆల్ టైం ఫేవరెట్ గా మారిపోయాయి. దీంతో సలార్ లో కూడా ప్రభాస్ నుంచి అలాంటి డైలాగ్స్ నే అభిమానులు ఆశించారు. అయితే మూవీలో అలాంటి మాస్ డైలాగ్స్ సంగతి పక్కన బెడితే.. అసలు ప్రభాస్ మాట్లాడడమే గగనంలా కనిపించింది. అసలు సినిమా మొదటి భాగంలో అయితే ప్రభాస్ పెద్దగా డైలాగ్సే చెప్పలేదు.
ఇక సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న డైలాగ్స్ తో రానిచేశాడు. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, వాళ్లను గర్ల్ ఫ్రెండ్స్ అంటారు, రెండు నిమిషాల్లో దొరలా రెడీ చేస్తా, పగిలిందా, సారీ.. ఇలా షార్ట్ అండ్ పెప్పర్ డైలాగ్స్ తో మూవీ మొత్తం మీద ప్రభాస్ 38 డైలాగ్ లు చెప్పారట. మూవీ చూసి వచ్చిన ఆడియన్స్.. ప్రభాస్ ఎన్నిసార్లు మాట్లాడాడని లెక్కపెట్టి సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు నటించిన సినిమాల్లో.. ప్రభాస్ తక్కువ మాట్లాడింది ఈ చిత్రంలోనే.
అయితే డైలాగ్స్ లేకున్నా, ప్రభాస్ తన కట్ అవుట్ తో మూవీని ఓ రేంజ్ కి తీసుకు వెళ్లారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే గూస్బంప్స్ రంపించారు. మరి మొదటి భాగంలో మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్న ప్రభాస్.. సెకండ్ పార్టులో అయినా మాట్లాడతారా..? లేదు రెండో భాగంలో కూడా షార్ట్ అండ్ పెప్పర్ డైలాగ్స్ తోనే సరిపెట్టేసతారా అనేది చూడాలి.
Next Story