Fri Dec 20 2024 22:21:00 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు..? కారణం అదేనా..?
సలార్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని పూర్తి స్థాయిలో చేయకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి..?
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా..? అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా ప్రకటించి.. సినిమా పై ఉన్న హైప్ ని మరింత పెంచేశారు. మొదటి భాగం 'సీజ్ ఫైర్'ని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
మూవీ రిలీజ్ కి కేవలం ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. కానీ మూవీ టీం ఇప్పటివరకు సరైన ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. ఇటీవల ఒక ట్రైలర్ అండ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఈ రెండు తప్ప మరో ప్రమోషన్స్ కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదని చెబుతున్నారు. అలాగే రాజమౌళితో ఇంటర్వ్యూ తప్ప మరో ఇంటర్వ్యూ ప్రమోషన్ లేదని కూడా తెలుస్తుంది. రాజమౌళి ఇంటర్వ్యూని కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.
అలాగే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన సెకండ్ ట్రైలర్ ని కూడా పోస్టుపోన్ చేశారు. ఏదో టెక్నికల్ సమస్య అని చెప్పుకొచ్చారు. అయితే చిత్ర యూనిట్ పాన్ ఇండియా మూవీకి కావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ అసలు ప్రమోషన్స్ చేయకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటి..?
సలార్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. డబ్బింగ్ వర్క్స్ కూడా ఇటీవలే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మూవీకి సంబంధించిన రీ రికార్డింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ పనుల్లో ప్రశాంత్ నీల్ అండ్ టీం ఫుల్ బిజీగా ఉండడం వలనే ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఇటీవలే మోకాలి సర్జరీ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. ఆయన కూడా ప్రస్తుతం రెస్ట్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది.
ఈ కారణాలు వలనే సలార్ ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో జరగడం లేదని తెలుస్తుంది. మూవీ టీం అంతా సినిమాని చెప్పిన డేట్ కి రిలీజ్ చేసేందుకు శ్రమ పడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీని ఒకసారి పోస్టుపోన్ చేశారు. ఈసారి కూడా పోస్టుపోన్ అంటే.. సంక్రాంతి రావడం అనేది కష్టం అవుతుంది. అందుకనే ఈసారి రిలీజ్ మిస్ అవ్వకూడని మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
Next Story