Sat Dec 21 2024 09:56:35 GMT+0000 (Coordinated Universal Time)
సలార్ విధ్వంసం.. ఈ విషయం గమనించారా
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'సలార్' టీజర్ వచ్చేసింది. జులై 6, 2023 ఉదయం 5:12 గంటలకు టీజర్ ను
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'సలార్' టీజర్ వచ్చేసింది. జులై 6, 2023 ఉదయం 5:12 గంటలకు టీజర్ ను రిలీజ్ చేశారు. ఎలివేషన్స్ కు కేరాఫ్ అయిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రేంజిలో ఈ సినిమాను కూడా తీసుకుని వస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే అంటూ.. పవర్ఫుల్ బీజీఎంతో ప్రభాస్ను చూపించడం అభిమానులకు తప్పకుండా గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న విజువల్స్ చూస్తుంటే కేజీఎఫ్ రేంజిలో సలార్ సినిమా కూడా ఉందని అర్థమవుతోంది.
ఇక్కడొక షాకింగ్ విషయం ఏమిటంటే సలార్ సినిమా రెండు భాగాలుగా రాబోతోందట.. సలార్ తొలి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానున్నట్లు ఈ టీజర్తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సలార్ కూడా మనం రెండు భాగాలుగా చూడబోతున్నాం. ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ కు ఉండే లింక్స్ ను కూడా సినీ అభిమానులు వెతకడం మొదలుపెట్టారు. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Next Story