Tue Jan 14 2025 23:09:34 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : RRR రికార్డు బ్రేక్ చేసిన సలార్..
సలార్ చిత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందట. అది ఏ విషయంలో తెలుసా..?
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్షిప్ కథాంశంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ 'సలార్'. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, హౌస్ ఫుల్ కావడం కూడా జరిగిపోయింది. కాగా ఈ చిత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందట. అది ఏ విషయంలో తెలుసా..?
సలార్ తెలుగు టెలివిజన్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుందట. ఇందుకోసమే దాదాపు రూ.22 కోట్ల వరకు ఖర్చు చేసిందట. తెలుగులో ఇంతటి భారీ స్థాయికి ఒక సినిమాని కొనుగోలు చేయడం ఇదే మొదటిసారట. గతంలో RRR టీవీ రైట్స్‌ని అన్ని భాషలకు కలిపి 25 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అదే హైయెస్ట్. కానీ ఇప్పుడు సలార్ ఒక్క తెలుగులోనే 22 కోట్లకు అమ్ముడు పోవడం సంచనలన రికార్డు అని పేర్కొంటున్నారు.
ఒక్క టెలివిజన్ రైట్స్ మాత్రమే కాదు. డిజిటల్ రైట్స్ కూడా కలుపుకొని సలార్ సినిమా 350 కోట్ల బిజినెస్ చేసిందట. ఆర్ఆర్ఆర్ చిత్రం అప్పటిలో 325 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఈ విషయంలో కూడా సలార్, RRR రికార్డుని బ్రేక్ చేసినట్లు అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వార్తని రెబల్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి రిలీజ్ తరువాత కలెక్షన్స్ తో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇది ఇలా ఉంటే, రాజమౌళితో సలార్ మూవీ టీం చేసిన ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. కేజీఎఫ్ సినిమాలో పోలిస్తే ఈ చిత్రంలో డ్రామా ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేజీఎఫ్, సలార్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదని తేల్చి చెప్పేసారు. ఇక ఈ ఇంటర్వ్యూ.. సెట్స్ లో జరిగిన విషయాలు, ప్రభాస్ ఫుడ్ విషయాలు, సినిమా స్టోరీకి సంబంధించిన విషయాలతో సరదా సరదాగా సాగింది. ఆ ఇంటర్వ్యూని మీరు కూడా చూసేయండి.
Next Story