Mon Dec 23 2024 02:03:40 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ 'సలార్' రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఎలివేషన్స్ తో నిండిపోయి ఉంటుంది ఈ సినిమా అని అందరూ భావిస్తూ ఉన్నారు. తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28, 2023 లో విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఆలస్యం చేస్తూ వస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబెలే ఫిలిమ్స్ ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక అధికారిక అనౌన్స్మెంట్ ను ఈనెల 15వ తేదీన ఉంటుంది అని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆరోజున మధ్యాహ్నం 12:58 కి సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ తో పాటు విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే కేవలం సినిమా రిలీజ్ డేట్ ను మాత్రమే అనౌన్స్ చేశారు.
సలార్ సినిమా కంటే ముందుగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం కథలో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇక ప్రాజెక్ట్ కె విషయంలో కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు.
News Summary - prabhas salar movie release date
Next Story