Mon Dec 23 2024 19:39:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ కిచెన్.. దీపికా ఫిదా
ప్రభాస్ ఏ సినిమా షూటింగ్ చేసినా ఆ సెట్ లో వాళ్లందరికీ పండగేనని చెప్పాలి. ఇంటి నుంచి తెప్పించిన భోజనం వారికి తినిపిస్తారు
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. సలార్, ప్రాజెక్ట్ K సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే.. ప్రభాస్ ఏ సినిమా షూటింగ్ చేసినా.. ఆ సెట్ వాళ్లందరికీ పండగేనని చెప్పాలి. తన ఇంటి నుంచి తెప్పించిన రకరకాల వంటకాలతో.. తన కో ఆర్టిస్టులకు అతిథి మర్యాదలు చేస్తాడు మన బాహుబలి.
ట్రీట్ లో...
ఇలా ప్రభాస్ ట్రీట్ ఇచ్చిన ప్రతిసారి ఆ వంటకాలను తన కో ఆర్టిస్టులు ఫొటోలు తీసి.. నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ప్రాజెక్ట్ K షూటింగ్ కోసం దీపికా పదుకొనె హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎప్పటిలాగానే ప్రభాస్ ఇంటి నుంచి వివిధ రకాలైన వంటకాలను సెట్ కు తెప్పించి.. అతిథి మర్యాదలు చేశాడు. అది చూసిన దీపికా ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద స్టార్ హీరో ఇలా.. సెట్ లో డైరెక్టర్, హీరోయిన్, కో ఆర్టిస్టులకు ఇలా భోజనాలతో అతిథి మర్యాదలు చేయడాన్ని చూసి స్టన్ అయిపోయింది. ఆ వంటకాలన్నింటినీ ఫొటో చూసి తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసి, ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ లను ట్యాగ్ చేసింది.
గతంలోనూ...
కాగా.. గతంలో సాహో సినిమా షూటింగ్ సమయంలో శ్రద్ధ కపూర్ కి, సలార్ షూటింగ్ లో శృతిహాసన్ కి, ఆదిపురుష్ సినిమా సమయంలో కృతి సనన్ కు ఇలాగే ఇంటి నుంచి తెప్పించిన స్పెషల్ ఫుడ్ తో అతిథి మర్యాదలు చేశారు. అది చూసిన హీరోయిన్లంతా ప్రభాస్ కు ఫిదా అయిపోయారు. అలాగే ఈ మధ్యే కరీనా కపూర్ ఫ్యామిలీకి ప్రభాస్ బిరియాని పార్శిల్ పంపాడు. ఇలా ప్రభాస్ ఫుడ్ కి, అతిథి మర్యాదలకు స్టార్ హీరోయిన్లంతా ఫ్యాన్స్ అవుతున్నారు. ఇప్పుడు దీపికా కూడా.. ప్రభాస్ కి ఫిదా అయింది.
Next Story