సాహో కోసం శ్రద్ద మరీ అంత తక్కువ తీసుకుందా?
ప్రభాస్ – శ్రద్ద కపూర్ కాంబినేషన్ లో తెరెక్కుతున్న భారీ చిత్రం సాహో ఆగస్టు 30 న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం టీం అన్ని భాషల్లో ప్రమోషన్స్ [more]
ప్రభాస్ – శ్రద్ద కపూర్ కాంబినేషన్ లో తెరెక్కుతున్న భారీ చిత్రం సాహో ఆగస్టు 30 న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం టీం అన్ని భాషల్లో ప్రమోషన్స్ [more]
ప్రభాస్ – శ్రద్ద కపూర్ కాంబినేషన్ లో తెరెక్కుతున్న భారీ చిత్రం సాహో ఆగస్టు 30 న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం టీం అన్ని భాషల్లో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ కోసం ప్రభాస్ భారీగానే తీసుకుని ఉంటాడు అని చాలామంది అనుకున్నారు కానీ ఈమూవీ కోసం ప్రభాస్ తన రెగ్యులర్ పారితోషికంలో కేవలం 20శాతం మాత్రమే తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఇక ఇందులో ప్రభాస్ కి జోడిగా నటించిన శ్రద్ద కపూర్ కు అటుఇటుగా 7 కోట్ల రూపాయలు ఇచ్చారని గాసిప్స్ వినిపించాయి ఆమధ్య. అయితే తాజాగా బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈమూవీ కోసం ఆమె అంత తీసుకోలేదని కేవలం 3 కోట్లు కి అటుఇటు గా రెమ్యూనరేషన్ తీసుకుందని చెబుతున్నారు.
శ్రద్ద ఇంత తక్కువ తీసుకుందంటే నిజంగానే ఆశ్చర్యమే. ఎందుకంటే శ్రద్ద ఈమూవీ కోసం రెండేళ్లు కేటాయించింది. ఈ రెండేళ్లలో ఆమె హిందీ లో 3 సినిమాలు చేసుకుంటే.. ఆమెకు ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుంది. కానీ ఆమె అంత తీసుకోలేదు. మరి ఎందుకు ఆమె ఇంత తక్కువ తీసుకుందో మాత్రం క్లారిటీ లేదు.