మొదటి రోజు చెన్నై సిటీలో ప్రభాసే టాప్
భారీ యాక్షన్స్ తో నిన్న రిలీజ్ అయినా ప్రభాస్ సాహో చిత్రం కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు పక్కన [more]
భారీ యాక్షన్స్ తో నిన్న రిలీజ్ అయినా ప్రభాస్ సాహో చిత్రం కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు పక్కన [more]
భారీ యాక్షన్స్ తో నిన్న రిలీజ్ అయినా ప్రభాస్ సాహో చిత్రం కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే చెన్నై సిటీ లో సాహో తమిళ, హిందీ, తెలుగు వర్షన్స్ మొత్తం కలిపి 73 లక్షల గ్రాస్ సాధించింది. కేవలం తెలుగు వర్షన్ కి మాత్రమే 32లక్షల గ్రాస్ వసూళ్లతో అల్ టైం తెలుగు హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇప్పటివరకు మహేష్ నటించిన భరత్ అనే నేను మూవీ పేరిట ఉన్న 27లక్షల రికార్డు ని ఈ చిత్రం అధిగమించింది. ఓవరాల్ గా తమిళనాడు మొత్తం అన్ని భాషలు చూసుకుంటే మొదటి రోజు ఈమూవీ దాదాపు 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. 4 కోట్లు అంటే మాములు విషయం కాదు.
లాంగ్ వీకెండ్ లో ఈమూవీ రిలీజ్ అవ్వడం ప్లస్ అయింది. శని,ఆదివారాలు సెలవలు కాబట్టి కలెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. పైగా సోమవారం వినాయక చవితి కలిసిరావడంతో సాహో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం కలదు. చూద్దాం ఎంతవరకు ఈమూవీ కలెక్ట్ చేస్తుందో అని..