శాటిలైట్ అండ్ డిజిటల్ కూడా ఆకాశంలోనే
ప్రభాస్ నుండి బాహుబలి తర్వాత వస్తున్నా సాహో చిత్రంతో ట్రేడ్ లోనే కాదు…. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయనడానికి నిన్నగాక మొన్న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన సాహో [more]
ప్రభాస్ నుండి బాహుబలి తర్వాత వస్తున్నా సాహో చిత్రంతో ట్రేడ్ లోనే కాదు…. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయనడానికి నిన్నగాక మొన్న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన సాహో [more]
ప్రభాస్ నుండి బాహుబలి తర్వాత వస్తున్నా సాహో చిత్రంతో ట్రేడ్ లోనే కాదు…. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయనడానికి నిన్నగాక మొన్న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన సాహో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్ష్యం. ప్రభాస్ ఫ్యాన్స్ లక్షమంది దాక ఈ ఈవెంట్ కి హాజరయ్యారంటే.. సాహో క్రేజ్ ఏ లెవల్లో ఉందో తెలుస్తుంది. సుజిత్ అనే యంగ్ డైరెక్టర్ ఇంత భారీగా సినిమాని తెరకెక్కించాడంటే.. ఇప్పటికి చాలామందికి జీర్ణం కావడం లేదు. సాహో ఖర్చుని రామరమిగా ప్రభాస్ మాటల్లో 350 కోట్లు అయినట్లు తెలుస్తుంది. ఈ ఖర్చు మొత్తం సాహో థియేట్రికల్ హక్కుల కిందే వచ్చేసింది.సాహో అన్ని భాషలకు కలిపి ఈ రేంజ్ ప్రైస్ వచ్చింది. మరి కేవలం థియేట్రికల్ రైట్స్ కే ఆ రేంజ్ ప్రైస్ వస్తే మిగిలిన హక్కులకు అంటే శాటిలైట్, డిజిటల్ హక్కుల కింద ఎంత రావాలి.
ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో అదే ముచ్చట నడుస్తుంది. సాహో ట్రైలర్ తోనే భారీ నుండి అతి భారీ అంచనాలు పెంచేసిన సాహో చిత్రం.. ఇప్పుడు జరిగే ప్రమోషనల్ కార్యక్రమాలతోను సినిమా మీద మరింత హైప్ పెంచుతుంది. మరి ఆ రేంజ్ క్రేజ్ ఉన్న సాహో హిందీ సాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కి 85 కోట్లకి డీల్ సెట్ చేసినట్లుగా నేషనల్ మీడియా టాక్. బాహుబలితో విపరీతమైన క్రేజ్ సంపాదించినా ప్రభాస్ సాహో తో అందరిలో ఎంతగా ఇంట్రెస్ట్ పుట్టించాడా అనేది ఈ డీల్ చూస్తే తెలుస్తుంది. కేవలం సల్మాన్, అమీర్ ఖాన్ సినిమాలకు వచ్చే సాటిలైట్, డిజిటల్ హక్కుల రేటు ఇప్పుడు సాహో చిత్రానికొచ్చింది అంటే.. ప్రభాస్ బాలీవుడ్ క్రేజ్ ఏ లెవల్లో ఉందొ తెలుస్తుంది. ఇక హిందీలో ఇలా ఉంటే.. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళ లకు కలిపి సాహో డిజిటల్, శాటిలైట్ హక్కులకు 110 కోట్లకి యువి వారు బేరం పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. అంత రేటుకి కాస్త వెనుకాముందు ఆడినా.. ఫైనల్ గా 100 కోట్లు రావడం ఖాయమంటున్నారు. మరి ప్రభాస్ సాహో క్రేజ్ ఆకాశాన్ని తాకింది. విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ.. సాహో క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది తప్ప తరగడం లేదు.