Sun Dec 22 2024 04:02:19 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ శ్రీనును దూరం పెట్టేశారా.. నిజమిదే..!
ప్రభాస్ నన్ను దూరం పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. కానీ అందులో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అత్యంత సన్నిహితుల్లో శ్రీను ఒకరు. టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా పేరుంది. అయితే ప్రభాస్ కు శ్రీను అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ తన దగ్గరే ఉంటాడు శ్రీను. ఏకంగా అతడి పేరే ప్రభాస్ శ్రీను అయిపోయిందంటే వారి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలి కాలంలో ప్రభాస్ శ్రీనును దూరం పెట్టేశారంటూ కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై తాజాగా ప్రభాస్ శ్రీను స్పందించాడు.
ప్రభాస్ నన్ను దూరం పెట్టినట్టుగా ప్రచారం జరిగింది. కానీ అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని శ్రీను చెప్పుకొచ్చాడు. ఆయనతో గొడవపడి విడిపోవాలని నాలాంటి వారు అనుకోరు. ఇవన్నీ కూడా పనిలేని వాళ్లు సృష్టించే పుకార్లు. అప్పుడు .. ఇప్పుడు అనే కాదు ప్రభాస్ ఎప్పటికీ మారడని.. ఆ మంచితనం ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను. సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకునే రోజులలో ప్రభాస్ కు శ్రీను పరిచయమయ్యాడు. ప్రభాస్ మొదటి సినిమా 'ఈశ్వర్' సినిమాలో చేయలేకపోయినా.. ఆ తరువాత శ్రీను పలు సినిమాల్లో ప్రభాస్ తో కలిసి నటించాడు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ, నాతో అంతే చనువుతో ఉంటాడు. స్టార్ డమ్ ను బట్టి మారాలనే విషయం ప్రభాస్ కి తెలియదని శ్రీను చెప్పుకొచ్చాడు.
తన పెదనాన్న కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. అభిమానులు రూపొందించిన ఓ వీడియోను ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోను రూపొందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ వీడియోలో కృష్ణంరాజు, ప్రభాస్ ల చిత్రాల్లోని క్లిప్పింగ్స్ ను పక్కపక్కనే చూపించారు.
Next Story