Sat Dec 21 2024 02:23:17 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : జాతకాన్ని నమ్మి సలార్ రిలీజ్ చేస్తున్నాము.. నిర్మాత కామెంట్స్
సలార్ సినిమాని జాతకాన్ని నమ్మి రిలీజ్ చేస్తున్నాము అని నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Salaar : కేజీఎఫ్ చిత్రాలు తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. ఇక అందరిలో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం.. సడన్ గా చిత్రాన్ని పోస్టుపోన్ చేసింది.
డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇక ఈ మూవీ పోస్టుపోన్ అవ్వడం గురించి చాలా వార్తలే వినిపించాయి. గ్రాఫిక్స్ వర్క్ సరిగా లేవని మళ్ళీ రీ వర్క్ కి వెళ్లాయని, అసలే షూట్ పూర్తి కాలేదని పలు వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు ఎందుకు పోస్టుపోన్ వేశారు అనేది మాత్రం తెలియదు. తాజాగా సలార్ నిర్మాత చేసిన కామెంట్స్ తో ఈ విషయం పై ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "తాము జాతకాలు ఎక్కువ నమ్ముతామని, దశాబ్ద కాలంగా జాతకాలను అనుసరించే ప్రయాణం చేస్తున్నట్లు, ఆ పద్ధతిలోనే సలార్ విడుదల తేదీని కూడా ఎంపిక చేసినట్లు" చెప్పుకొచ్చారు. ఇక ఈ జాతకాలు అనుసరించే సలార్ ని పోస్టుపోన్ చేసినట్లు తెలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ జాతకం ఎలా ఉంటుందో చూడాలి.
ఇది ఇలా ఉంటే, ఈ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్'కి రీమేక్ గా వస్తుందన్న వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను కూడా నిర్మాత విజయ్ కిరంగదూర్ కొట్టిపారేశారు. ఉగ్రమ్ రీమేక్ అన్న వార్తల్లో నిజం లేదన్నారు. కాగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం 2 గంటల 55 నిమిషాల 22 సెకన్ల నిడివితో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Next Story