Sun Nov 17 2024 21:53:28 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ఓటు ఎందుకు వేయలేదు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ఓటు ఎందుకు వేయలేదు..? అసలు ప్రభాస్ కి ఇక్కడ ఓటు ఉందా..?
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. మొత్తం మీద 70 శాతం పై పోలింగ్ జరిగినట్లు సమాచారం. గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2018లో 70 శాతం పై పోలింగ్ జరిగింది. కాగా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం పోలింగ్ బూత్స్ వద్దకి వచ్చి లైన్ లో నిలబడి మరి ఓటు వేసి వెళ్లారు. ఈక్రమంలోనే చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా స్టార్స్ అంతా తమ ఓటుని వేశారు.
ఇక ఓటు వేసిన తమ అభిమాన స్టార్స్ ఫోటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం డార్లింగ్ సంబంధించిన ఫోటో, వీడియో రాకపోవడంతో నిరాశ చెందారు. అసలు ప్రభాస్ తన ఓటుని వేశారా..? వేస్తే పోలింగ్ బూత్ వద్ద కనిపించాలి కదా..? అసలు ప్రభాస్ కి తెలంగాణలో ఓటు ఉందా..? అనే సందేహాలు మొదలయ్యాయి. నిజగానే ప్రభాస్ ఓటు వేసి ఉంటే పోలింగ్ బూత్ వద్ద కచ్చితంగా కనిపించేవారు.
కాబట్టి ఆయన ఓటు వేయలేదని తెలుస్తుంది. ఇక్కడ ఓటు ఉంది ఉంటే, అందరి హీరోలతో పాటు కచ్చితంగా ఓటు వేసేవారు. దీంతో తెలంగాణలో ప్రభాస్ ఓటు లేదని తెలుస్తుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, అలాగే తన కుటుంబంలోని పలువురు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భీమవరం నుంచి పోటీ చేస్తుంటారు. కృష్ణంరాజు ఫ్యామిలీతో పాటు ప్రభాస్ తల్లిదండ్రులకు కూడా ఆంధ్రాలోనే ఓటు హక్కు ఉంది. కాబట్టి ప్రభాస్ కి కూడా అక్కడే ఓటు ఉందని అర్ధమవుతుంది.
అందువలనే ప్రభాస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదని తెలుస్తుంది. ఇక ప్రభాస్ నిన్న 'కల్కి 2898 AD' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న కమల్ హాసన్ కూడా నిన్న ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Next Story