Thu Dec 19 2024 23:59:34 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898AD : అప్పుడు చిరుకి.. ఇప్పుడు ప్రభాస్కి.. 'కల్కి' కూడా..
అప్పుడు చిరంజీవిలా ఇప్పుడు ప్రభాస్ కూడా తన సమస్యని ఎదుర్కొని కల్కితో సంచలనం సృష్టిస్తాడా..?
వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా సి అశ్వినీ దత్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడి'. నాగస్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందుతుంది. కాగా ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విడుదల తేదీ కోసమే చిత్ర యూనిట్ కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుతూ మూవీ షూటింగ్ ని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకు వచ్చింది.
దాదాపు ఇంకో నెలలో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుందని ఆడియన్స్ అంతా ఆశ పడుతుంటే.. వారికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ని ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి. ఈ షెడ్యూల్ లో ఏపీ, తెలంగాణ ఎన్నికల తేదీని మే 13న ప్రకటించింది. ఇక ఈ ప్రకటన చూసిన దగ్గర్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. ఈ ఎన్నికల వల్ల కల్కి మూవీ వాయిదా పడుతుందా అనే సందేహం పెద్ద ప్రశ్నగా మారింది.
ఎందుకంటే ఎన్నికల సమయంలో సినిమా రిలీజ్ లు చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ కనిపించవు. చాలామంది పొలిటికల్ ప్రమోషన్స్ లో ఉండడంతో సినిమా చూడడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు. దీనివల్ల సినిమా బాగున్న కలెక్షన్స్ లేక ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కల్తీ లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి ఇది చాలా పెద్ద సమస్య అనే చెప్పాలి. మరి ఈ రిలీజ్ విషయంలో చిత్ర నిర్మాతలు ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
నిర్మాత అశ్వినీ దత్ తమ బ్యానర్ లో గతంలో నిర్మించిన చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం కూడా ఇలాంటి ఒక సమస్యని ఎదుర్కొంది. ఈ మూవీ రిలీజ్ సమయంలో భారీ తుఫాన్ వచ్చింది. అప్పటికే ఈ మూవీ రిలీజ్ చాలా లేట్ అవుతూ వచ్చింది. మళ్లీ వాయిదా వేస్తే సమస్య అవుతుందని ధైర్యం చేసి తుఫాన్ సమయంలోనే రిలీజ్ చేశారు.
భారీ తుఫాన్ లో కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి భారీ కలెక్షన్స్ సాధించి వైజయంతి మూవీస్ బ్యానర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. కాగా ఇప్పుడు కల్కి మూవీని జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదల తేదీకే తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రెండు సోషియో ఫాంటసీ తరహా సినిమాలే. మరి అప్పుడు చిరంజీవిలా ఇప్పుడు ప్రభాస్ కూడా కల్కితో సంచలనం సృష్టిస్తాడో లేదో చూడాలి.
Next Story