Tue Nov 05 2024 12:34:57 GMT+0000 (Coordinated Universal Time)
100 మందితో "నాటు నాటు" స్టెప్పులేసిన ప్రభుదేవా
ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. అవార్డు తీసుకుని స్వదేశానికి..
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ఇటీవలే పలు హాలీవుడ్ చిత్రాలను దాటుకుని ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. అవార్డు తీసుకుని స్వదేశానికి వచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పాట స్వరకర్త, రచయిత, కొరియోగ్రాఫర్, పాటకు స్టెప్పులేసి ఉర్రూతలూగించిన హీరోలు.. ఇలా ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
తాజాగా ఇండియన్ మైకేల్ జాక్సన్, దిగ్గజ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తనదైన స్టయిల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తన డ్యాన్స్ స్టూడియోలో వంద మందితో కూడిన తన బృందంతో ప్రభుదేవా నాటునాటు హూక్ స్టెప్పులు వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుదేవా ఆయన బృందం హుషారుగా చేసిన నాటు నాటు స్టెప్పు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. థ్యాంక్యూ లెజెండ్ అని ట్వీట్ చేసింది.
Next Story