Mon Dec 23 2024 03:31:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ల మార్పుతో తారుమారైన జీవితాలు.. లవ్ టుడే ట్రైలర్
మీ ఇంట్లో ఒకేనా..అని సత్యరాజ్ అడిగితే.. మా ఇంట్లో ఒకే అంకుల్ నేనేం చెప్తే అది.. అంటాడు హీరో ప్రదీప్ రంగనాథన్.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'లవ్ టుడే'. తెలుగులో ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు ఇదే టైటిల్ తో విడుదల చేయనున్నారు. నేడు లవ్ టుడే తెలుగు ట్రైలర్ ను విజయ్ దేవరకొండ ఆవిష్కరించాడు. ఈ ట్రైలర్ లో.. హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ కనిపిస్తారు. హీరో ప్రదీప్.. తన ప్రేమ విషయాన్ని సత్యరాజ్ కి చెబుతాడు.
మీ ఇంట్లో ఒకేనా..అని సత్యరాజ్ అడిగితే.. మా ఇంట్లో ఒకే అంకుల్ నేనేం చెప్తే అది.. అంటాడు హీరో ప్రదీప్ రంగనాథన్. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. నేనేం చెప్తే అదే.. ఒకే ఒక రోజు నీ ఫోన్ తను.. తన ఫోన్ నువ్వు మార్చుకుంటారు..రేపు మీరు ఒకే అనుకుంటే నాకు డబుల్ ఒకే..అంటూ ట్విస్ట్ ఇచ్చాడు సత్యరాజ్. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ ఎలా నడిచిందని కొంచెం సస్పెన్స్ లో పెడుతూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా ఇవానా నటించింది. రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.
Next Story