బాలయ్య చూస్తుండగానే… ప్రకాష్ రాజ్ రచ్చ?
ప్రకాష్ రాజ్ నటన అంటే ఎంతమందికి ఇష్టమో.. ఆయనకు కోపమొస్తే.. అంతే నష్టం జరుగుతుంది. విలన్ గా, తండ్రిగా, మామగా, పొలిటిషన్ గా ఇలా ఏ పాత్రలోనైనా [more]
ప్రకాష్ రాజ్ నటన అంటే ఎంతమందికి ఇష్టమో.. ఆయనకు కోపమొస్తే.. అంతే నష్టం జరుగుతుంది. విలన్ గా, తండ్రిగా, మామగా, పొలిటిషన్ గా ఇలా ఏ పాత్రలోనైనా [more]
ప్రకాష్ రాజ్ నటన అంటే ఎంతమందికి ఇష్టమో.. ఆయనకు కోపమొస్తే.. అంతే నష్టం జరుగుతుంది. విలన్ గా, తండ్రిగా, మామగా, పొలిటిషన్ గా ఇలా ఏ పాత్రలోనైనా జీవించగలిగే నటుల్లో ప్రకాష్ రాజే ముందు వరుసలో ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రకాష్ రాజ్ కి కోపమొచ్చినప్పుడు నిర్మాతలు నష్టపోతే…. మరికొన్నిసార్లు ప్రకాష్ రాజే నష్టపోయేవాడు. విలక్షణ నటుడిగా పేరున్నప్పటికీ…. ప్రకాష్ రాజ్ కోపానికి మాత్రం హద్దులు ఉండవు. అందుకే చాలామంది దర్శకనిర్మాతలు ప్రకాష్ రాజ్ ని లైట్ తీసుకుని, సత్య రాజ్ సముద్రఖని వంటి కేరెక్టర్ ఆర్టిస్ట్ ల వెంట పడుతున్నారు. కొన్నిసార్లు తన తప్పు తెలుసుకుని ప్రకాష్ రాజ్ సర్దుకుపోతే.. కొన్నిసార్లు మాత్రం దర్శకనిర్మాతలే ప్రకాష్ రాజ్ ని సినిమాల నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. షూటింగ్ స్పాట్ లో గొడవలు పడడం ప్రకాష్ రాజ్ విషయంలో కొత్తేమీకాదు. ఈమధ్యనే రామ్ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమకోసమే సినిమా సెట్స్ లో హీరోయిన్ అనుపమకి ప్రకాష్ రాజ్ కి ఆమధ్యన గొడవైనట్లుగా ఓ వార్త చక్కర్లు కొట్టింది.
నీ ఇల్లు కాదు…….
తాజాగా బాలకృష్ణ రూలర్ సినిమా సెట్స్ లోను ప్రకాష్ రాజ్ ఏదో రచ్చ చేసాడనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రూలర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ షూటింగ్ సమయంలో బాలయ్య – హీరోయిన్ భూమిక ల మీద కొన్ని సన్నివేశాల షూట్ జరుగుతుండగా భూమిక తన పాత్రని సరిగా చేయకపోవడంతో ఆమెపై ప్రకాష్ రాజ్ గట్టిగా అరిచినట్టు సోషల్ మీడియా టాక్. అలా అరవడంతో ఉలిక్కిపడిన కెమెరామన్ ప్రసాద్.. షూటింగ్ స్పాట్ ‘నీ ఇల్లు కాదు’ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బిహేవ్ చేయడానికి అని చెప్పడంతో.. ప్రకాష్ రాజ్ రూలర్ సెట్స్ నుంచి కోపంగా వెళ్ళిపోయాడట. అయితే బాలయ్య కానీ ఇతర యూనిట్ సభ్యులెవరూ ప్రకాష్ రాజ్ ని పట్టించుకోకుండా ఉండిపోవడంతో.. కాస్త కూల్ అయిన ప్రకాష్ రాజ్ మళ్లీ యధావిధిగా షూటింగ్ కి హాజరైనట్టుగా సమాచారం.