Prakash raj : “మా” ఎన్నికలపై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
సీసీ టీవీ ఫుటేజ్ చూసిన తర్వాతనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మా ఎన్నికల కౌంటిగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మూవీ ఆర్టిస్ట్ [more]
సీసీ టీవీ ఫుటేజ్ చూసిన తర్వాతనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మా ఎన్నికల కౌంటిగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మూవీ ఆర్టిస్ట్ [more]
సీసీ టీవీ ఫుటేజ్ చూసిన తర్వాతనే తమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మా ఎన్నికల కౌంటిగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అవతవకలు జరిగాయని తాను అభిప్రాయపడుతున్నామన్నారు. విష్ణుతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఎన్నికల అధికారితోనే తమకు సమస్య అని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను సీసీ టీవీ ఫుటేజీ అడిగినా ఎన్నికల అధికారి ఇవ్వలేదన్నారు.
తమ అనుమానాలను….
మా ఎన్నికల్లో ముందు రోజు రాత్రి గెలిచిన వాళ్లు మరుసటి రోజు ఉదయానికి ఓడిపోయారన్నారు. అది తమ అనుమానాలను మరింత బలపర్చిందన్నారు. తమ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు త్వరలోనే మంచు విష్ణు కార్యాలయానికి చేరుతాయన్నారు. ఎన్నికల అధికారి సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వకపోవడం వల్లనే తాము పోలీసులను ఆశ్రయించామన్నారు. సీీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు