ప్రణీత మెచ్చిన హీరోలు!!
ప్రణీత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కాలేకపోయినా.. ప్రస్తుతం మాత్రం హీరోయిన్స్ అందరిలో టాప్ లెవల్లో 100 మెట్లు పైన ఉంది. సినిమాల్లో కెరీర్ పరంగా స్టార్ [more]
ప్రణీత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కాలేకపోయినా.. ప్రస్తుతం మాత్రం హీరోయిన్స్ అందరిలో టాప్ లెవల్లో 100 మెట్లు పైన ఉంది. సినిమాల్లో కెరీర్ పరంగా స్టార్ [more]
ప్రణీత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కాలేకపోయినా.. ప్రస్తుతం మాత్రం హీరోయిన్స్ అందరిలో టాప్ లెవల్లో 100 మెట్లు పైన ఉంది. సినిమాల్లో కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోలేకపోయిన.. ప్రణీత సుభాష్ ప్రస్తుతం కరోనా వారియర్ లా అందరి మన్ననలు పొందుతుంది. కరోనా లాక్ డౌన్ లో ఆకలితో అలమటిస్తున్న పెదలకి అన్నదానం చేస్తూ టాప్ హీరోయిన్స్ కి షాకిచ్చింది. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ కూడా ఎలాంటి సహాయం చెయ్యని టైం లో లక్షల్లో పారితోషకం అందుకుంటూ.. అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న ప్రణీత కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడం మాత్రం గర్వించదగిన విషయమే.
అయితే టాలీవుడ్ లో ప్రణీత టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గ నటించింది. ఎన్టీఆర్ రభస తోనూ, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలలో నటించిన ప్రణీతకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ప్రణీతకి తమిళ హీరో అజిత్ అంటే చాల ఇష్టమట. తమిళం రాకపోయినా అజిత్ సినిమాలను చూస్తానంటుంది. బాలీవుడ్ లో మాత్రం అజయ్ దేవగన్ అంటే చాల ఇష్టపడే ప్రణీతకు టాలీవుడ్ హీరోస్ లో పవన్ కళ్యాణ్ అంటే చాల ఇష్టమట. ఇక మహేష్ విషయానికొస్తే.. మహేష్ అందగాడని, ప్రభాస్ సూపర్ స్టార్ అని… రభసతో ఎన్టీఆర్ తో నటించిన ప్రణీతకి జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్ ల కనిపిస్తాడట. ఇక డ్యాన్స్ విషయానికొస్తే… ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇద్దరేనని ఒకరికి ఇంకొకరు తీసిపోరని చెబుతుంది.