Sun Dec 22 2024 21:50:20 GMT+0000 (Coordinated Universal Time)
HanuMan : అమెరికాలో 'హనుమాన్' సంచలన రికార్డు..
రిలీజ్ అవ్వడానికి చాలా కష్టాలు పడిన హనుమాన్.. ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అమెరికాలో 'హనుమాన్' సంచలన రికార్డు..
HanuMan : తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ 'హనుమాన్'.. రిలీజ్ అవ్వడానికి చాలా కష్టాలు పడింది. చిన్న హీరో సినిమా అని, సంక్రాంతి పండగ రేస్ నుంచి తప్పుకోవాలని మూవీ టీం బెదిరింపులు వెళ్లాయి. థియేటర్స్ ఇవ్వకుండా చేశారు. అయినాసరి చిత్ర యూనిట్ తమ కంటెంట్ పై నమ్మకం పెట్టుకొని మూవీని రిలీజ్ చేశారు. కంటెంట్ ఉన్నోడికి ప్రేక్షకులే బ్రహ్మరథం పడతారు.
ఇప్పుడు హనుమాన్ విషయంలో అదే అయ్యింది. ప్రీమియర్ షోలతోనే ఫుల్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిన్న చిత్రం.. భారీ స్థాయిలో రిలీజైన పెద్ద సినిమాకి పోటీగా మారింది. థియేటర్స్ పెరుగుతున్నాయి, షోలు పెరుగుతున్నాయి. దీంతో కాసుల వర్షం కురుస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు అమెరికాలో ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తుంది.
కేవలం ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం 380K పైగా డాలర్స్ ని అందుకుంది. ఇక సినిమా రిలీజయ్యి ఒక్కరోజు అయ్యిందో లేదో వన్ మిలియన్ (1M) డాలర్స్ ని రాబట్టేసింది. ఒక చిన్న హీరో సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తేజ సజ్జకి ఇదే మొదటి 1M మార్క్ మూవీ. ఈ 1M మార్క్ ని అందుకున్న హీరోల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పాటు రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నారు.
కాగా ఈ మూవీ మొదటి రోజు ఇండియా వైడ్ 7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి పెరుగుతున్న ఆదరణతో కలెక్షన్స్ జోరు మరింత పెరుగుతుంది. కొత్త షోలు ఏర్పడిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మరి ఫుల్ రన్ లో హనుమాన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.
Next Story