Mon Dec 23 2024 01:29:51 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : ప్రభాస్ 'సలార్' ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎక్కడ, ఎప్పుడు..?
ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సలార్' ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా..?
Salaar : బాహుబలి సినిమాల తరువాత ప్రభాస్ అభిమానులను ఖుషీ చేసిన 'సలార్'. పృద్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా మొదటి వీకెండ్ వన్ 400 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పటివరకు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి బ్రేక్ ఈవెంట్ సాధించింది.
ప్రస్తుతం సంక్రాంతి సినిమాల సందడి ఉన్నా.. థియేటర్స్ వద్ద సలార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్.. సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేసింది. స్వర్గీయ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు జయంతి సందర్భంగా జనవరి 20 నుంచి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుంది. కేవలం సౌత్ లాంగ్వేజ్స్ లోనే రిలీజ్ చేస్తున్నారు. హిందీ ఓటీటీ రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు.
Next Story