Mon Dec 23 2024 06:26:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ 'సలార్' రిలీజ్ పోస్ట్‌పోన్ కన్ఫర్మ్..
ప్రభాస్ సలార్ రిలీజ్ పోస్ట్‌పోన్ కన్ఫర్మ్. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్..
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), బాహుబలి స్టార్ ప్రభాస్ (Prabhas) కలయికలో ఒక సినిమా వస్తుంది అంటే ఇండియా వైడ్ భారీ క్రేజ్ ఉండడం సహజం. అలాంటి మోస్ట్ హైప్డ్ మూవీ సలార్ (Salaar) సెప్టెంబర్ నెలలో థియేటర్స్ లో సందడి చేయబోతోందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ సలార్ టీం మాత్రం అందరికి షాక్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. సలార్ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ పార్ట్ ‘Ceasefire’ ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. గతంలో ఒక చిన్న టీజర్ తప్ప మూవీ నుంచి మరే అప్డేట్ ఇవ్వలేదు. ఆ టీజర్ లో కూడా ప్రభాస్ పేస్ ని చూపించకపోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందారు. ఆ తరువాత ప్రభాస్ సంబంధించి ఒక స్పెషల్ టీజర్ వస్తుందని టాక్ వినిపించినా అది రాలేదు. ఇక ఆగష్టు నెల చివరి వారంలో ట్రైలర్ అప్డేట్ వచ్చే అవకాశం అన్నారు.
కానీ సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టినా మూవీ టీం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఇక తాజాగా ఫిలిం వర్గాల్లో సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నవంబర్ కి వాయిదా పడినట్లు.. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవ్వడం వలనే సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యినట్లు తెలుస్తుంది. సినిమా పై భారీ హైప్ ఉండడంతో ప్రశాంత్ నీల్ ఎక్కడా రాజీపడకుండా వర్క్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే బెటర్ అవుట్ పుట్ తో నవంబర్ లో రానున్నారట. రిలీజ్ వాయిదా విషయాన్ని, కొత్త రిలీజ్ డేట్ ని త్వరలో నిర్మాతలు అనౌన్స్ చేయనున్నారట.
ఇక ఈ వార్త ప్రభాస్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తే వీకెండ్ తో కలుపుకొని మొత్తం 5 రోజులు సెలవలు కలిసి వస్తున్నాయి. దీంతో ఓ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని అభిమానులు ఆశ పడ్డారు. కానీ ఇప్పుడు పోస్ట్‌పోన్ ఫ్యాన్స్ ఆశల పై నీరు చల్లింది. మరి మోస్ట్ వైలెంట్ మెన్ సలార్ నవంబర్ లో ఎలాంటి సునామీ సృష్టిస్తాడో చూడాలి.
Next Story