Fri Nov 22 2024 11:51:50 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ చివరిలో ఓ సర్ప్రైజ్ ఉందంటున్న ప్రశాంత్ నీల్..
సలార్ చివరిలో ఓ సర్ప్రైజ్ ఉందంటున్న ప్రశాంత్ నీల్. పార్ట్ 2పై అది హైప్ క్రియేట్ చేసేలా ఉంటుందట. ఏంటి ఆ సర్ప్రైజ్..?
Salaar : ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేబోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శృతిహాసన్, టిన్ను ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందుతుంది. అయితే మొదటి పార్ట్ చివరిలో ఓ సర్ప్రైజ్ ఉందని ప్రశాంత్ నీల్ చెబుతున్నారు. రాజమౌళితో సలార్ టీం చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు.
ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ ప్రశ్నిస్తూ.. "ప్రేక్షకులకు తెలియకుండా మీరు సినిమాలో ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా?" అని అడగగా, ప్రశాంత్ నీల్ సమాధానమిస్తూ.. "సినిమా చివరిలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సలార్ పార్ట్ 2 పై అది హైప్ ని క్రియేట్ చేసేలా ఉంటుంది. బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనే పాయింట్ లా ఆ సీన్ కూడా ఆడియన్స్ ని పార్ట్ 2 చూసేందుకు థియేటర్స్ కి రప్పించేలా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మాటలు విన్న అభిమానులు.. సినిమా చివరిలో ఏం జరుగుతుంది..? ఎవరైనా అతిథిది పాత్ర ఉండబోతుందా..? అని ఆసక్తి మొదలైంది. ఇటీవల ఓ బుల్లి సింగర్ మీడియాతో మాట్లాడుతూ.. నేను సలార్ లో ప్రభాస్, యశ్, పృథ్వీరాజ్ సుకుమారన్ అంకుల్కి పాట పాడాను" అని చెప్పుకొచ్చింది. ట్రైలర్ లో యశ్ లాంటి కట్ అవుట్ కనిపించింది అంటూ అభిమానులు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం సలార్, కేజీఎఫ్ కి కనెక్షన్ లేదని కుండా బద్దలు కొట్టేశారు. సలార్ 1980 టైములో జరిగిన కథ, సలార్ ఇప్పుడు టైములో జరిగే కథ అని చెప్పారు.
ఆ రెండు వేరు వేరు ప్రపంచాలని, అయినా తనకి సినిమాటిక్ యూనివర్స్ లు క్రియేట్ చేసేంత ధైర్యం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ సలార్, కేజీఎఫ్ కి మధ్య కనెక్షన్ లేదని మాత్రమే చెప్పారు. కానీ సలార్ లో యశ్ లేరని ఏమి చెప్పలేదు కదా. రాకీ భాయ్ పాత్రతో కాకుండా యశ్ ఈ సినిమాలో మరో పాత్రతో కనిపించే అవకాశం ఉంది కదా. సినిమా చివరిలో ఆ సర్ప్రైజ్ యశ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Next Story