Mon Dec 23 2024 01:08:58 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : కేజీఎఫ్‌లో చేసిన తప్పులే సలార్‌లో కూడా చేశా.. ప్రశాంత్ నీల్
కేజీఎఫ్‌లో చేసిన తప్పులే సలార్‌లో కూడా చేశాను అంటున్న ప్రశాంత్ నీల్. ఏంటి ఆ తప్పులు..?
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్షిప్ కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమైన సినిమా 'సలార్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందుతుంది. మొదటి భాగం 'సీజ్ ఫైర్'ని డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఇక ఇన్నాళ్లు ప్రమోషన్స్ చేయని మూవీ టీం.. ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ సలార్‌లో చేసిన తప్పులు గురించి మాట్లాడారు.
ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే.. "నేను కేజీఎఫ్ లో ఏ తప్పులు అయితే చేశానో. సలార్ లో కూడా అవే తప్పులు రిపీట్ చేశాను. ఫైనల్ కట్ రెడీ చేసిన తరువాత దానిని ఒకసారి చూసి.. ఏమన్నా చేంజస్ చేయాలా అని తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోయాను. ఫైనల్ కట్ ని పూర్తిగా చూడలేని పరిస్థితి నాది. అయినాసరి నేను ఆ ఫైనల్ కట్ పై ఆనందం గానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా సలార్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ వింటుంటే అవి నిజమే అనిపిస్తుంది. డబ్బింగ్ వర్క్స్ ఇటీవలే కంప్లీట్ చేసిన మూవీ టీం.. ప్రస్తుతం రీ రికార్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పనుల్లో ప్రశాంత్ నీల్ అండ్ టీం ఫుల్ బిజీగా ఉండడం వలనే సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించలేకపోతున్నారు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా టికెట్స్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తుంటే.. నైజాం హక్కులు సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం టికెట్స్ ని థియేటర్స్ వద్దే కొనుగోలు చేసుకోవాలి అని చెబుతుంది. ఆన్లైన్ లో కాకుండా గతంలో సినిమాలకు థియేటర్స్ వద్ద క్యూలో నిలబడి ఎలైతే టికెట్స్ కొనుగోలు చేసుకునే వారు అలా వింటేజ్ డేస్ మాదిరి టికెట్స్ ని కొనుగోలు చేసుకోవాలని చెబుతుంది.
Next Story