Mon Dec 23 2024 01:30:36 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : రెండు బ్యాడ్ న్యూస్‌లు చెప్పిన ప్రశాంత్ నీల్.. సలార్ మూవీ..
ప్రభాస్ అభిమానులకు ప్రశాంత్ నీల్ రెండు బ్యాడ్ న్యూస్‌లు చెప్పారు. ఆ వార్తలు ఏంటంటే..
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ హైపెడ్ మూవీ 'సలార్'. శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్‌గా నటిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మొదటి భాగాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేసిన మేకర్స్.. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది.
ఈసారి పోస్టుపోన్ చేసే మాట ఏం లేదు. ప్రశాంత్ నీల్ ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశాడు. తాజాగా ఒక బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. సలార్ గురించి రెండు బ్యాడ్ న్యూస్ లు చెప్పారు. ఆడియన్స్ అంతా సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉండబోతుందని అనుకుంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ఏ కనెక్షన్ లేదని ప్రశాంత్ నీల్ కుండ బద్దలు కొట్టేశారు. సలార్ స్టాండ్ ఎలోన్ మూవీ అని, కేజీఎఫ్ యూనివర్స్‌కి సలార్‌కి ఏ కనెక్షన్ లేదు, ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు.
ఇదొక బ్యాడ్ న్యూస్ అనుకుంటే, ఇదే ఇంటర్వ్యూలో మరో చేదు వార్త కూడా చెప్పారు. అదేంటంటే, ఈ సినిమా కథ.. ప్రశాంత్ నీల్ మొదటి మూవీ 'ఉగ్రం'కి అన్ అఫీషియల్ రీమేక్ గా రాబోతుంది. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. "ఇద్దరు ప్రాణ మిత్రులు, భద్ర శత్రువులుగా ఎలా మారారు అనేది సలార్ కథ. ఈ మూవీ స్టోరీ ఫ్రెండ్షిప్ మెయిన్ పాయింట్ గా సాగుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. ఉగ్రం మూవీ కథ కూడా ఇదే.
అయితే ఉగ్రం మూవీలో ఇద్దరి స్నేహితుల మధ్య శత్రుత్వాన్ని పూర్తి స్థాయిలో చూపించారు. సలార్ సినిమాలో ఆ శత్రుత్వాన్ని పూర్తి స్థాయిలో చూపించనున్నారు. 'ఉగ్రం' మూవీని కన్నడ ప్రజలు ఆల్రెడీ చేసేశారు. హిందీ డబ్ వెర్షన్ కూడా పలు యూట్యూబ్ అండ్ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో మొన్నటి వరకు అందుబాటులో ఉండేది. కానీ ఇటీవలే ఆ చిత్రాన్ని డిలీట్ చేయించారు. ఉగ్రం హిందీ వెర్షన్ చూసిన నార్త్ ఆడియన్స్ కి కూడా సలార్ కథ తెలుసు.
ఈ విషయమే ప్రభాస్ అభిమానులను కలవర పెడుతున్నాయి. కేజీఎఫ్ 2 రికార్డులను సలార్ పార్ట్ 1తోనే బద్దలవుతాయని రెబల్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ ప్రశాంత్ నీల్ చెప్పిన ఈ రెండు బ్యాడ్ న్యూస్‌లతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Next Story