Mon Dec 23 2024 01:21:14 GMT+0000 (Coordinated Universal Time)
NTR31 యాక్షన్ ఫిల్మ్ కాదా..? ప్రశాంత్ నీల్ కామెంట్స్ వైరల్..!
ప్రశాంత్ నీల్ NTR31 గురించి మాట్లాడుతూ.. ఆడియన్స్ అంతా ఇదొక యాక్షన్ సినిమా అని అంచనా వేస్తున్నారు. కానీ ఇది..
NTR31 : సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 31వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్' మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా ప్రశాంత్ నీల్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో NTR31 గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. "నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఒక కొత్త జోనర్ అండ్ కొత్త ఎమోషన్ తో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించబోతున్నాను. ఆడియన్స్ అంతా ఇదొక యాక్షన్ సినిమా అని అంచనా వేస్తున్నారు. కానీ ఇది కంప్లీట్ కొత్త జోనర్ మూవీ" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్ అభిమానులంతా NTR31 కేజీఎఫ్ తరహాలో యాక్షన్ ఫిల్మ్ గా ఉంటుందని ఆశించారు. కానీ ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో కొంచెం ఆందోళన కలిగిస్తుంది. ప్రయోగం ఎందుకు డైరెక్టర్ గారు, కేజీఎఫ్ లా ఒక కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ తియ్యండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు మాత్రం.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కొత్తగా చూపించబోతున్నారు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. అలాగే హృతిక్ రోషన్ చేస్తున్న వార్ 2 సెట్స్ లోకి 2024లో అడుగు పెట్టనున్నారు ఎన్టీఆర్. అటు ప్రశాంత్ నీలో కూడా సలార్ 2 పూర్తి చేయాల్సి ఉంది. NTR31 2024 చివరిలో లేదా 2025లో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.
Next Story