Mon Dec 23 2024 07:36:02 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమదేశం హీరో కాలికి సర్జరీ.. ఎమోషనల్ పోస్ట్
2015 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన అబ్బాస్.. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సెటిలయ్యారు. ఇటీవల
కొందరు హీరోలు నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా.. ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ప్రేమదేశం హీరో అబ్బాస్ కూడా ఒకరు. ఆ సినిమా వచ్చిన తొలినాళ్లలో అబ్బాస్ కు అమ్మాయిల అభిమానులు ఎక్కువగా ఉండేవారు. మాధవన్ తర్వాత.. అబ్బాస్ నే డ్రీమ్ బాయ్ గా చూసేవారు. అలనాటి లవర్ బాయ్ అబ్బాస్.. ఇప్పుడు ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటో ఒకటి ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు తొలుత కంగారు పడినా.. తర్వాత త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.
2015 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన అబ్బాస్.. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా సెటిలయ్యారు. ఇటీవల అబ్బాస్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కుడికాలి మోకాలికి సర్జరీ చేయాల్సి వచ్చింది. అందుకోసం కాలిపై ఉన్న వెంట్రుకలను కూడా తొలగించారు. సర్జరీ పూర్తయ్యాక అబ్బాస్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసి.. "ఆస్పత్రిలో ఉన్న సమయంలో నా మనసంతా గందరగోళంగా ఉంది. నా భయాన్ని అధిగమించేందుకు చాలా ప్రయత్నించాను. శస్త్రచికిత్స పూర్తయ్యాక కొంత ఉపశమనం కలిగింది. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని రాసుకొచ్చారు. అబ్బాస్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Next Story