ప్రియాకు మెగా హీరో ఛాన్స్ ఇస్తాడా..?
కేవలం ఒక్క వీడియోతోనే ఇండియా వైడ్ పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాశ్ వారియర్. అది కూడా కన్ను కొట్టే సీన్. సినిమా రిలీజ్ కి ముందు ఒక [more]
కేవలం ఒక్క వీడియోతోనే ఇండియా వైడ్ పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాశ్ వారియర్. అది కూడా కన్ను కొట్టే సీన్. సినిమా రిలీజ్ కి ముందు ఒక [more]
కేవలం ఒక్క వీడియోతోనే ఇండియా వైడ్ పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాశ్ వారియర్. అది కూడా కన్ను కొట్టే సీన్. సినిమా రిలీజ్ కి ముందు ఒక లెక్క విడుదల తరువాత ఒక లెక్క. ఆమె నటించిన లవర్స్ డే గురువారం రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది. తన అందంతో, కళ్లతో యూత్ ని ఫిదా చేసిన ప్రియా వారియర్ చేసిన ఈ సినిమాను చూసిన యూత్ సైతం దీనికి నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అంతే కాదు ఈ సినిమాను ప్రియా వారియర్ పేరుతో బాగా ప్రమోట్ చేశారు కానీ అందులో ఆమె పాత్ర చిన్నది కావడం మరో షాక్ కలిగించే అంశం.
అవకాశం ఇస్తాడా..?
ప్రియా నటన కూడా అంతగా లేకపోవడం మరో విషయం. కేవలం కన్నుగీటు సీన్ తప్ప అంత గొప్ప సీన్స్ లేకపోవడం, ఆమె అందంగా కనిపించకపోవడంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. పాపులారిటీ వచ్చిన రోజుల్లో కొంచెం తొందరపడి ఉంటే ఈపాటికి ఆమె కెరీర్ ఇంకోలా ఉండేది అని అంటోంది కేరళ మీడియా. టాలీవుడ్ స్టార్ హీరో బన్నీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు ప్రియా వారియర్ మాట్లాడుతూ.. గత ఏడాది బన్నీతో చేసే ఛాన్స్ మిస్ అయ్యిందని ఈసారి వదులుకోనని స్టేజి మీద చెప్పేసింది. మరి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి బన్నీతో సినిమా ఉండకపోవచ్చు. ఈ సినిమా రిజల్ట్ వల్ల ఈమెకు సినిమా అవకాశాలు ఏమొస్తాయో ఏమో చూడాలి.