Mon Dec 23 2024 07:42:45 GMT+0000 (Coordinated Universal Time)
తల్లైన ప్రియాంక చోప్రా.. ఇన్ స్టా లో వెల్లడించిన దంపతులు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని వారిద్దరూ తమ ఇన్ స్టా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. డిసెంబర్ 2018లో పెళ్లితో ఒక్కటైన ఈ జంట.. ఇప్పుడు తల్లిదండ్రులవ్వడంతో పలువురు సెలబ్రిటీలు, వారి స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వాస్తవానికి వీరు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. బేబీ వియాను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. అంటూ పోస్ట్ చేశారు.
Also Read : సమ్మె బాటలోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు
ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ఇద్దరూ సరోగసీ ద్వారా బిడ్డను స్వాగతించారు. "మేము అద్దె గర్భం ద్వారా బిడ్డను స్వాగతించాము. ఈ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక సమయంలో మేము మా కుటుంబంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము.. కనుక మా ప్రైవసీని గౌరవించండి " అంటూ నిక్ - ప్రియాంకలు కోరారు.
Next Story