Mon Dec 23 2024 16:02:51 GMT+0000 (Coordinated Universal Time)
మొత్తానికి కూతురి ముఖాన్ని చూపించిన స్టార్ హీరోయిన్
పాప అనారోగ్యంతో పాటు ప్రైవసీ కోసం పాపను మీడియా కెమెరాలకు చిక్కనివ్వలేదు. గతేడాది జనవరిలో జన్మించిన మాల్టీ మేరీ..
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా - అమెరికా సింగర్ నిక్ జోనస్ దంపతులు గతేడాది సరోగసి ద్వారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే.. ప్రియాంక సరోగసీని ఆశ్రయించడంపై దుమారం రేగింది. ఇటీవల తాను సరోగసిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కారణాలు చెప్పింది. వీరిద్దరికీ కూతురు పుట్టగా.. ఆ పాపకు మాల్టీమేరి అని పేరుపెట్టారు. కానీ ఏడాదైనా ఇంతవరకూ కూతురి ఫొటోలను బయటపెట్టలేదు. పాప అనారోగ్యంతో పాటు ప్రైవసీ కోసం పాపను మీడియా కెమెరాలకు చిక్కనివ్వలేదు. గతేడాది జనవరిలో జన్మించిన మాల్టీ మేరీ జనవరి 15న తొలిపుట్టినరోజు జరుపుకుంది.
ఇక తాజగా ప్రియాంక తన కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రియాంక భర్త నిక్ జోనస్, ఆయన సోదరులు అమెరికాలో ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. సోమవారం జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రియాంక, జోనస్ దంపతులు మాల్టీ మేరీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసింది. కూతురును ఎత్తుకుని, ఆడిస్తూ కెమెరాలకు ఫోజిచ్చింది. ప్రియాంక కూతుర్ని చూసిన అభిమానులు.. మాల్టీ చాలా ముద్దొస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story