Sun Dec 22 2024 19:18:39 GMT+0000 (Coordinated Universal Time)
ఒప్పేసుకున్న బండ్ల గణేష్.. క్షమాపణలు కూడా అడిగాడట..!
పవన్ కళ్యాణ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలకు భారీ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే..! కొందరు తనను పవన్ కళ్యాణ్ కు దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారని ఓ అభిమానితో మాట్లాడుతూ బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ ఫోన్ లో మాట్లాడుతూ దర్శకుడు త్రివిక్రమ్ తనను దూరం పెట్టాడని.. అభిమానులందరూ బండ్ల గణేష్ అని పిలిస్తే తాను తప్పకుండా స్టేజీ మీదకు వచ్చేస్తానని తెలిపాడు. అంతేకాకుండా మంచి స్పీచ్ ను కూడా సిద్ధం చేశానని బండ్ల గణేష్ అనడం కూడా అప్పట్లో వైరల్ అయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలు చేసింది తానేనని.. ఒప్పేసుకుంటున్నానని అన్నారు. ఈ ఘటన గురించి తాను త్రివిక్రమ్ కు క్షమాపణలు కూడా చెప్పినట్లు బండ్ల గణేష్ వెల్లడించాడు. అప్పట్లో ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని చెప్పిన బండ్ల గణేష్.. ఇప్పుడు మాత్రం తనదేనని ఒప్పేసుకోవడం విశేషం. త్రివిక్రమ్‌ని తిట్టిన వాయిస్ నాదే. అప్పుడేదో కోపంలో తిట్టాను. దానికి ఆయనకు సారీ కూడా చెప్పానని బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ నిజాన్ని ఒప్పుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ కు మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం. పవన్ కళ్యాణ్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలకు భారీ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచు ఒక రేంజిలో ఉంటుంది. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచు ఇవ్వలేకపోయాడు. త్రివిక్రమ్ బండ్ల గణేష్ ను రానివ్వలేదనే ప్రచారం జరిగింది. తన అభిమాన హీరో ఫంక్షన్‌కి తనని పిలవకపోవటంపై బండ్ల గణేష్, త్రివిక్రమ్‌పై ఓ ఫోన్ కాల్ లో ఓ రేంజ్లో తిట్టాడు.
Next Story