Mon Dec 23 2024 12:03:13 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ కోసం డేట్స్ త్యాగం చేసిన నిర్మాత !
ఎఫ్3 ఏప్రిల్ 28వ తేదీన ఎఫ్ 3 రానుందంటూ మరోసారి గుర్తుచేశారు. కానీ ఆర్ఆర్ఆర్ కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశం ఉండటంతో..
ఆర్ఆర్ఆర్.. జనవరి 7నే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. అంతా బాగుంటే మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే అదే తేదీకి ఎఫ్ 3 కూడా విడుదలకు రెడీ అయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి అందుకు సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు.
ఏప్రిల్ 28వ తేదీన ఎఫ్ 3 రానుందంటూ మరోసారి గుర్తుచేశారు. కానీ ఆర్ఆర్ఆర్ కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశం ఉండటంతో.. నిర్మాత దిల్ రాజు కాస్త వెనక్కి తగ్గారు. ఎఫ్ 3 రిలీజ్ గురించి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ కు నో చెప్పలేను. ఎఫ్ 3 కోసం నేను లాక్ చేసిన తేదీకి ఆర్ఆర్ఆర్ విడుదల అయితే.. ఆ డేట్ ను త్యాగం చేస్తానని తెలిపారు. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి.. దానికి మార్గం చూపించడం మా బాధ్యత అని దిల్ రాజు తెలిపారు. ఆర్ఆర్ఆర్ మార్చి 18న కాకుండా.. ఏప్రిల్ 28న విడుదలైతే మాత్రం.. ఎఫ్3 విడుదల వాయిదా పడుతుంది.
Next Story