Mon Dec 23 2024 07:20:17 GMT+0000 (Coordinated Universal Time)
సింగం -4 మాత్రమే కాదు..5,6,7 కూడా వస్తాయ్ : సురేష్ బాబు
సూర్య నటించిన సింగం, యముడు, సింగం -3 సూపర్ హిట్ అయ్యాయి. సింగం-4 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ..
హైదరాబాద్ : కోలీవుడ్ హీరో సూర్య - ప్రియాంక అరుల్ మోహన్ జంటగా.. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "ఎతర్క్కుం తునింధవన్". సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా (ఈటీ) మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, హిందీ, మళయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా బృందం ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది. ఈ వేడుకకు టాలీవుడ్ నటుడు రానా, నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈటీ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సింగం -4 ఎప్పుడు తీస్తున్నారు ? అని సూర్య అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. సింగం -4 తీయాలని మేము అనుకోవడం కాదు.. హీరో ఒప్పుకుంటే కథ రాసి, సినిమా నిర్మిస్తాము. సూర్య ఒప్పుకోవాలే గానీ.. సింగం-4 మాత్రమే కాదు..5,6,7 కూడా వస్తాయి అని తెలిపారు. కాగా.. సూర్య నటించిన సింగం, యముడు, సింగం -3 సూపర్ హిట్ అయ్యాయి. సింగం-4 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో.. సురేష్ బాబు చేసిన కామెంట్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
News Summary - Producer Suresh Babu Speaks About Singam movie Series in ET Pre Release Event
Next Story