మహేష్ వైఖరితో తల పట్టుకుంటున్న నిర్మాతలు
కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకు తలనొప్పిగా మారాడు. తాను పెట్టే కండిషన్స్ వల్ల నిర్మాతలతో పాటు డైరెక్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవుట్ డోర్ [more]
కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకు తలనొప్పిగా మారాడు. తాను పెట్టే కండిషన్స్ వల్ల నిర్మాతలతో పాటు డైరెక్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవుట్ డోర్ [more]
కొన్ని కండిషన్స్ వల్ల మహేష్ బాబు నిర్మాతలకు తలనొప్పిగా మారాడు. తాను పెట్టే కండిషన్స్ వల్ల నిర్మాతలతో పాటు డైరెక్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అవుట్ డోర్ షూటింగ్స్ అంటే మహేష్ రావడానికి నిరాకరిస్తున్నాడని ఎప్పటి నుండో టాక్ ఉంది. మహర్షి సినిమాలో కొన్ని సన్నివేశాలు పల్లెటూరు నేపథ్యంలో తీయాల్సిన అవసరం వచ్చింది. అవి గోదావరి సైడ్ కానీ కేరళలో కానీ చిత్రీకరిద్దాం అనుకున్నారు. అయితే మహేష్ అవుట్ డోర్ అయితే రాను అని చెప్పడంతో చేసేది ఏమీ లేక రామోజీ ఫిలిం సిటీలో ఓ పల్లెటూరు సెట్ వేసి చిత్రీకరించారు. దాని కోసం కోట్లు ఖర్చు పెట్టారు.
సహజత్వం రాకపోయినా…
ఇక తాజాగా ఓ సన్నివేశం కోసం బీడు వారిన భూమిని చూపించాల్సి వచ్చిందట. రాయలసీమలో అటువంటి భూములే ఉంటాయి కాబట్టి అక్కడే షూట్ చేద్దాం అనుకుంటే మహేష్ మాత్రం అవుట్ డోర్ షూటింగ్‌కి రానని మొరాయించడంతో… దాన్ని కూడా ఫిల్మ్ సిటీలోనే తెరకెక్కించేశారని సమాచారం. మహేష్ నో చెప్పడానికి కారణం ఉంది. అతను అవుట్ డోర్ షూటింగ్స్ కి వస్తే అక్కడి క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేరు. అందుకే ఇలా సెట్స్ కి పరిమితం అవుతుంటారు. కాకపోతే సహజత్వం ఉండదు. కానీ నిర్మాతలకి తప్పదు.