మహర్షి మీద ఆ ఎఫెక్ట్ పడుతుందా..?
గత నాలుగు రోజులుగా బయ్యర్లను భయపెడుతున్న మహర్షి నిర్మాతలు అంటూ రకరకాలుగా వస్తున్న వార్తలు చూస్తుంటే... మహేష్ మహర్షి సినిమా మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడడం ఖాయంగానే కనబడుతుంది. ఈ సినిమాని నిర్మిస్తున్న ముగ్గురు నిర్మాతల్లో ఇద్దరు మాత్రం మహర్షి బిజినెస్ విషయంలో కచ్చితంగా ఉంటున్నారని టాక్ ఎప్పటి నుండో సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్ లో వినబడుతూనే ఉంది. పీవీపీ సైలెంట్ గానే ఉన్నప్పటికీ.. దిల్ రాజుకి, అశ్వినీదత్ కి మధ్యన మహర్షి బిజినెస్ విషయంలో పొసగడం లేదని.. మహర్షి హిందీ డబ్బింగ్ హక్కుల అప్ప్పుడే వినబడింది.
ఓవర్సీస్ రైట్స్ కి భారీగా అడుగుతున్నారా..?
తాజాగా ఇపుడు దిల్ రాజు, అశ్వినీదత్ లు తమ తమ గత సినిమాల నష్టాలను మహర్షి మూవీ తోనే పూడ్చుకోవాలని చూడడంతో.. మహర్షి బిజినెస్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయట. అందులో తెలుగు సినిమాలకు అతి ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్ విషయంలో మహర్షి నిర్మాతలు పట్టుదలగా ఉన్నారట. మహర్షి సినిమా ఓవర్సీస్ హక్కులను ఏకంగా 25 కోట్లు చెబుతూ అక్కడి ఓవర్సీస్ బయ్యర్లను భయపెడుతున్నారట. అదేమిటి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 2.ఓ నే మేము 25 కోట్లకు కొనలేదు.. మహర్షి ని ఎలా కొంటామని బయ్యర్లు బెంబేలెత్తుతున్నారట.
అసలే మహేష్ పరిస్థితీ బాగాలేక...
అసలే మహేష్ మీద స్పైడర్, బ్రహ్మోత్సవం ఎఫెక్ట్స్ మాములుగా లేవు. ఏదో భరత్ అనే నేను బాగుందని టాకొచ్చినా.. ఓవర్సీస్ లో భరత్ కి అంతగా కలెక్షన్స్ రాలేదు. అందుకే మహర్షి సినిమా మీద ఎన్ని అంచనాలున్నప్పటికీ.. ఆ సినిమాకి 25 కోట్లు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అయితే మహర్షి ప్రి రిలీజ్ బిజినెస్ మీద ఎఫెక్ట్ పడడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.