Tue Dec 24 2024 02:33:28 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాజెక్ట్ కె.. ఈ రేంజికి వెళుతుందని అసలు అనుకోలేదు
ప్రపంచ వ్యాప్తంగా ఉండే కామిక్ అభిమానులను కొత్త కామిక్స్, సూపర్ హీరో సినిమాలను ఏర్పాటు చేసే ఈవెంట్ ‘కామిక్ కాన్’
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. అనేకమంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలని పెంచుతూ చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉండే కామిక్ అభిమానులను ఆకట్టుకోడానికి, కొత్త కామిక్స్, సూపర్ హీరో సినిమాలను ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసే ఈవెంట్ ‘కామిక్ కాన్’. 1970లో అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో లో కామిక్ కాన్ ఈవెంట్ ని ప్రారంభించారు. ఆ తర్వాత నుండి ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రతి సంవత్సరం ‘కామిక్ కాన్’ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది ఈ ఈవెంట్ కి వస్తారు. ఈ ఈవెంట్ లో సినిమా ప్రమోషన్స్, అవార్డ్స్ లాంటివి చాలా ఉంటాయి. ఇలాంటి చోట సినిమాను ప్రమోట్ చేస్తే తప్పకుండా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ జనాలకు చేరుతుందని భావిస్తూ ఉంటారు. ఆ ప్లాన్ తోనే ప్రాజెక్ట్ కె చిత్రం కామిక్ కాన్ ను ఎంపిక చేసుకుంది.
‘కామిక్ కాన్’ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి తెలుగు సినిమా ప్రాజెక్ట్ K అని అంటున్నారు. ఈ సినిమాని ప్రమోట్ చేస్తే హాలీవుడ్ లో మార్కెట్ సంపాదించొచ్చు. ఈ ఏడాది జూలై 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు జరగనున్న వేడుకలో ‘ప్రాజెక్ట్ K’ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
Next Story