Mon Dec 23 2024 20:20:18 GMT+0000 (Coordinated Universal Time)
బట్టలిప్పిన హీరోపై పలు రాష్ట్రాల్లో నిరసనలు
బట్టలిప్పిన హీరోపై పలు రాష్ట్రాల్లో నిరసనలు
రణవీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫొటో షూట్ చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..! ఇటీవల ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. రణవీర్ సింగ్ 'పేపర్' మ్యాగజైన్‌కు చెందిన ఆశిష్ షా కోసం న్యూడ్ గా ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాడు. పేపర్ మ్యాగజైన్ కోసం నటుడి వైరల్ ఫోటో సిరీస్‌లో అతను చక్కటి ఆహార్యం కలిగిన జుట్టుతో నగ్నంగా, కార్పెట్‌పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చాడు. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం 1972 షూటింగ్లో నగ్నంగా కనిపించిన 70ల పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్కు ఈ ఫోటోషూట్ నివాళి అని అంటున్నారు. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. ఇక విమర్శలు కూడా భారీగా వస్తున్నాయి.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో రణ వీర్‌కు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రణ వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సామాజిక కార్యకర్తలు దుస్తుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ మానసిక రోగి బ్యానర్లు ప్రదర్శించారు. మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అబూ అజ్మీ రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటో మండిపడ్డారు. ముస్లిం మహిళలు హిజాబ్ ధరిస్తే తప్పుబడుతారు.. రణ్ వీర్ దుస్తులు లేకుండా ఫొటోలు దిగితే మాత్రం ఎందుకు ప్రశ్నించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రణవీర్ సింగ్ ఇటీవల షారుఖ్ ఖాన్ 'మన్నత్' పక్కన రూ. 119-కోట్ల భవనాన్ని కొనుగోలు చేశాడు. రణవీర్ సింగ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డేతో కలిసి 'సర్కస్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2022 క్రిస్మస్కు విడుదల కానుంది. అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్‌లతో కరణ్ జోహార్ తీస్తున్న "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ" లో రణవీర్ లీడ్ రోల్ లో చేస్తున్నాడు.
Next Story