Thu Apr 10 2025 06:28:23 GMT+0000 (Coordinated Universal Time)
పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం
రేవనాథ్ కు గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు బెంగళూర్ లోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణవార్త ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతలోనే ఆయన ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్ కన్నుమూశారు. పునీత్ మరణించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి పునీత్ మరణాన్ని తట్టుకోలేక.. ఆ ఒత్తిడిలోనే ఉన్నారు. ఒత్తిడి తట్టుకోలేక రేవనాథ్(78) గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రేవనాథ్ కు గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు బెంగళూర్ లోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆయన మృతితో పునీత్ కుటుంబ సభ్యులు మరోసారి విషాదంలో మునిగిపోయారు. ఓ వైపు భర్తను, మరోవైపు తండ్రిని కోల్పోయిన అశ్విని ని చూసి.. బంధువులు కంటతడి పెట్టుకుంటున్నారు.
Next Story