పోకిరి రేంజ్ లో ‘ఇస్మార్ట్ శంకర్’
డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. డిజాస్టర్స్ ఎన్ని వచ్చిన కానీ అతని సినిమా వస్తుందంటే వెయిట్ చేసే వాళ్లు చాలా మంది [more]
డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. డిజాస్టర్స్ ఎన్ని వచ్చిన కానీ అతని సినిమా వస్తుందంటే వెయిట్ చేసే వాళ్లు చాలా మంది [more]
డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం. డిజాస్టర్స్ ఎన్ని వచ్చిన కానీ అతని సినిమా వస్తుందంటే వెయిట్ చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. అతని మేకింగ్ స్టైల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. అలాంటి పూరికి ‘టెంపర్’ తరువాత ఒక్క హిట్ కూడా లేదు.తన కొడుకు తో తీసిన 'మెహబూబా' ఆర్థికంగానూ నష్టపరిచింది. ఇప్పుడు పూరి రామ్ పోతినేని తో ‘ఇస్మార్ట్ శంకర్’ మొదలెట్టాడు. పూరి – రామ్ కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. పూరి సినిమా షూటింగ్ ను చకచకా కానిచేయడం లో ఎక్స్పర్ట్. అలానే ఈసినిమాని కూడా త్వరగా పూర్తి చేసి మేలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.
అయితే ఈసినిమా హిట్ అవ్వడం పూరి కి చాలా అవసరం. అటు రామ్ కి కూడా ఈసినిమా హిట్ అవ్వడం అవసరం. అందుకే కథ విషయంలో ఇది వరకటికంటే కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెట్టినట్టు టాక్. పూరి ఫార్ములాతో నడిచే ‘ట్విస్టు’ల కథ ఇది. ‘పోకిరి’, ‘టెంపర్’ మాదిరిగా ఈసినిమా లో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని టాక్. సినిమా మొత్తం ట్విస్టులు ఉంటాయి అంట. నిజానికి ఈ కథ పూరి కొడుకు చేయాలి కానీ అప్పుడే ఇటువంటి కథ చేస్తే కెరీర్ పై ప్రభావం పడుతుందని రామ్ తో తీస్తున్నాడు.