Thu Dec 19 2024 12:50:50 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika : చావు నుంచి బయటపడ్డామంటూ.. రష్మిక వైరల్ పోస్టు..
చావు నుంచి బయటపడ్డామంటూ.. రష్మిక తన ఇన్స్టా స్టోరీలో వేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ అయ్యిపోయారు. దీంతో ఆమెకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్ కావాల్సిందే. ఈక్రమంలోనే రష్మిక తన ఇన్స్టా స్టోరీలో.. 'చావు నుంచి బయటపడ్డామంటూ' వేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏమైంది..?
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్ తో కలిసి రష్మిక ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ జర్నీకి సంబంధించిన ఫోటోని రష్మిక షేర్ చేస్తూ.. “కేవలం మీకు తెలియాలని చెబుతున్నాను, ఈరోజు మేము చావు నుంచి ఇలా బయటపడ్డాము" అంటూ కింద మరో ఫోటోని కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలో రష్మిక, శ్రద్దాదాస్ కాళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఈ పోస్టు వెనుక ఉన్న కథ ఏంటో రష్మిక తెలియజేయలేదు. అయితే ప్రముఖ నేషనల్ మీడియా ఈ పోస్టు వెనుక ఉన్న కథ గురించి ఇలా రాసుకొచ్చింది. రష్మిక, శ్రద్దా దాస్ కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కి విమానంలో బయలుదేరారు. అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 30 నిమిషాల్లోనే మళ్ళీ ముంబైలో ఎమర్జెన్సీ లాండింగ్ అయ్యిందట.
కాగా ఈ ఏడాది రష్మిక క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో నటించడంతో పాటు తన స్టార్డమ్ ని మరింత పెంచుకునేలా లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాలు అన్ని కలుపుకొని ప్రస్తుతం రష్మిక చేతిలో అరడజనకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Next Story