Thu Dec 19 2024 15:07:50 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : బన్నీతో కలిసి ఇన్స్టా రీల్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?
అల్లు అర్జున్తో కలిసి ఇన్స్టా రీల్ చేసిన అమ్మాయి ఎవరు..? ఆమె ఫాలోవర్స్ పెంచమని బన్నీ ఎందుకు అడుగుతున్నారు..?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరిలో తానే ముందు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి 23 మిలియన్ పైగా ఫాలోవర్స్ తో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కంటే టాప్ లో నిలిచారు. ఇక ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న తరువాత ఇన్స్టాగ్రామ్ సంస్థ నుంచి ఒక టీం వచ్చి.. బన్నీ పై ప్రత్యేక వీడియో కూడా చేశారు.
ఇండియన్ యాక్టర్స్ లో ఈ ఘనత అందుకున్న మొదటి నటుడిగా అల్లు అర్జున్ రికార్డు కూడా సృష్టించారు. ఈ హీరో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఓ రేంజ్ లో వైరల్ అవ్వాల్సిందే. అలాంటి బన్నీ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచడం కోసం.. ఆమెతో కలిసి ఇన్స్టా రీల్ చేశారు. ఆ అమ్మాయికి ప్రస్తుతం 13K ఫాలోవర్స్ ఉన్నారు. దానిని 30K చేయాలంటూ అభిమానులకు తెలియజేశారు. ఇక ఈ రీల్ ని ఆ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఇంతకీ అసలు ఆ అమ్మాయి ఎవరు..? అల్లు అర్జున్ ఆమెతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే అంత పరిచయం ఉందా..? అని అందరిలో ఒక సందేహం మొదలైంది. దీంతో ఆ అమ్మాయి ఎవరని అరా తీయడం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే ఆమె గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు అశ్విని. చాలా కాలం నుంచి అల్లు అర్జున్ ఇంట్లో ఈ అమ్మాయి పని చేస్తూ వస్తుంది. గతంలో కూడా అశ్విని అల్లు అర్జున్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించే.. బన్నీ వారసులు అల్లు అయాన్, అర్హ వీడియోల్లో కూడా ఈ అమ్మాయి కనిపిస్తుంటుంది. ఇప్పుడు అశ్విని కోరిక మేరకు ఆమె ఫాలోవర్స్ పెంచడం కోసం అల్లు అర్జున్ ఒక స్పెషల్ రీల్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ రీల్ పోస్టు చేయకముందు ఆమె ఫాలోవర్స్ 13K ఉన్నారు. కొన్ని గంటల్లోనే ఫాలోవర్స్ పెరుగుతూ ఇప్పుడు దాదాపు 20K వరకు చేరుకున్నాయి.
Next Story